క్రీడాభూమి

హాకీలో మహిళల జైత్రయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మార్చి 3: బెలారస్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు టెస్టుల హాకీ సిరీస్‌లో భారత మహిళా జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో 5-1 గోల్స్ తేడాతో బెలారస్‌ను మట్టికరిపించిన భారత జట్టు తాజాగా శనివారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో ప్రత్యర్థులను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ 9వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుని స్ట్రైకర్ రాణి భారత్‌కు తొలి గోల్‌ను అందించగా, ఆ తర్వాత ఎంతో పకడ్బందీగా ఆడి రెండో క్వార్టర్ ముగిసే వరకు భారత్‌ను కట్టడి చేసిన బెలారస్‌కు 36వ నిమిషంలో స్వియత్లానా బహుసెవిచ్ ఈక్వలైజర్‌ను అందించింది. ఆ తర్వాత దాదాపు మ్యాచ్ ముగిసే వరకు బెలారస్ అదే డిఫెన్స్‌ను కొనసాగించినప్పటికీ చిట్ట చివరి (60వ) నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను లాల్‌రెమ్సియామి గోల్‌గా మలచి బెలారస్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఈ సిరీస్‌లో 2-0 ఆధిక్యను సాధించింది.