క్రీడాభూమి

కోహ్లీకి విషమ పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 3: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది. పుణెలో జరిగిన ఈ సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో ఆసీస్ స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ (70 పరుగులకు 12 వికెట్లు) ధాటికి కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా అతని సహచర బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమవడంతో భారత జట్టు 333 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో వరుగా 19 విజయాల తర్వాత టీమిండియా జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బెంగళూరులో జరుగనున్న మ్యాచ్ టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీకి కెరీర్‌లోనే అత్యంత కఠినమైన పరీక్షగా నిలువనుంది. ఈ పరీక్షలో నెగ్గాలంటే, కోహ్లీ సహా భారత బ్యాట్స్‌మెన్ ఆసీస్ నూతన స్పిన్ ద్వయం ఒకీఫ్, నాథన్ లియోన్‌తో పాటు పేసర్ల ద్వయం మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్‌వుడ్‌లను సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయంలో భారత బ్యాట్‌మెన్ ఎంతమేరకు సఫలీకృతులవుతారన్నది ప్రశ్నార్థకమే. అలాగే ఆస్ట్రేలియా బాట్స్‌మెన్‌లో ధాటిగా ఆడుతున్న కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను స్వల్పస్కోరుకే త్వరగా పెవిలియన్‌కు చేర్చడం ఎలా అనేది కూడా భారత బౌలర్లకు పాలుపోవడం లేదు. పుణె టెస్టులో టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కొంత మేరకు ఫర్వాలేదనిపించినప్పటికీ ఫీల్డింగ్‌లో పదేపదే తడబడుతుండటం, డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డిఆర్‌ఎస్)ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో భారత జట్టు ఘోరంగా విఫలమవుతుండటం అందరినీ కలవరపెడుతోంది. పుణె టెస్టులో భారత జట్టు పరాజయానికి దారితీసిన ప్రధాన కారణాల్లో టాస్ ఓడిపోవడం కూడా ఒకటి కావడంతో ఇప్పుడు బెంగళూరు టెస్టులో టాస్ గెలవాలని కోహ్లీ భావిస్తున్నాడు. అలాగే గత టెస్టులో టెస్టు టూర్‌లో ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న కోహ్లీ ఇప్పుడు తన పోరాట పటిమను మరోసారి రుజువు చేసుకోవాలని ఎదురు చూస్తున్నాడు. ఇందుకోసం అతను మిచెల్ స్టార్ వేస్తున్న రివర్స్ స్వింగ్ బంతులను, ఒకీఫ్ వేస్తున్న ఆర్మ్‌స్పిన్ బంతులను గతంలో కంటే మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడం ఎలా అన్నదానిపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.
మరోవైపు చిన్నస్వామి స్టేడియంలోని పిచ్ బ్యాట్‌మెన్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నప్పటికీ బెంగళూరులో ఆదివారం వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంతకుముందు ఇక్కడ భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 2015లో జరిగిన టెస్టు మ్యాచ్‌ను వరుణుడు దెబ్బతీయడంతో ఆ మ్యాచ్ దాదాపు పూర్తిగా వర్షార్పణమైంది. అయితే గత ఏడాది కాలం నుంచి ఎంతో సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతుండటం, జట్టులోని ఒక్కో స్థానానికి అనేక మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండటం టీమిండియాకు ప్రధానమైన బలం. ఈ నేపథ్యంలో బుధవారం బరిలోకి దిగే తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందన్న విషయం అందరికీ ఆసక్తిని
కలిగిస్తోంది. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి సారథ్య పగ్గాలు కోహ్లీ చేతిలోకి వెళ్లిన నాటి నుంచి భారత జట్టు కూర్పు ఎప్పటికప్పుడు మారుతోంది. గత 24 టెస్టుల్లో ఒకే జట్టును యథాతథంగా తదుపరి టెస్టుకు కొనసాగించకపోవడమే ఇందుకు నిదర్శనం. కనుక పుణె కంటే బ్యాంటింగ్‌కు బాగా అనుకూలిస్తుందని భావిస్తున్న బెంగళూరు పిచ్ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని బుధవారం రెండో టెస్టులో బరిలోకి దిగే భారత తుది జట్టులో కూడా ఒకటి రెండు మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.