క్రీడాభూమి

కోహ్లీ నిష్క్రమణ స్వయంకృతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 4: ‘పాముపడగ’లాంటి కోహ్లీ వికెట్ తీసినందుకు తనకెంతో సంతోషంగా ఉందని ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో శనివారం తొలి రోజే భారత జట్టు వెన్నువిరిచిన ఆస్ట్రేలియా ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లియోన్ అన్నాడు. అయితే కోహ్లీ తన స్వయంకృతాపరాధం కారణంగానే అవుటయ్యాడని అతను అభిప్రాయ పడ్డాడు. ఎలాంటి షాట్ ఆఫర్ చేయకపోవడం ద్వారా కోహ్లీ తప్పు చేశాడని, ఆ కారణంగానే అతను అవుటయ్యాడని లియోన్ అన్నాడు. లియోన్ కేవలం 50 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టడంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలవుట్ అయిన విషయం తెలిసిందే. కోహ్లీ కేవలం 12 పరుగులు చేశాడు. ‘ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్లతోనే పోటీ పడాలనుకుంటారు. కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. డేల్ స్టెయిన్ మాటల్లో చెప్పాలంటే అతను ‘పాముతల’లాంటి వాడు. అందువల్ల కోహ్లీ వికెట్ తీయడం నాకు సంతోషకరమే’ అని తొలి రోజు ముగిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ లియోన్ అన్నారు. అయితే ఈ రోజు కోహ్లీ వికెట్ తీయడం అరుదైన సంఘటన అని అతను అంటూ, ఈ సిరీస్ చాలా సుదీర్ఘమైందని తమకు తెలుసునని, కోహ్లీ తిరిగి పుంజుకొని ఎదురు దాడి చేయవచ్చని తాము భావిస్తున్నామన్నాడు. కాగా, ఈ రోజు అదృష్టం ఆస్ట్రేలియా వైపు ఉందని అతను అభిప్రాయ పడ్డాడు. స్పిన్‌ను గొప్పగా ఆడే ఆటగాళ్లుగా పేరున్న భారత ఆటగాళ్లపై మీరు ఎలా సిద్ధమయ్యారని అడగ్గా, భారత ఆటగాళ్లకు వ్యతిరేకంగా బౌల్ చేయడాన్ని, ఒక మంచి బౌలర్‌గా నిరూపించుకోవడాన్ని తాను ఇష్టపడతానని లియోన్ చెప్పాడు.

చిత్రం..కేవలం 12 పరుగులకే నిష్క్రమించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ