క్రీడాభూమి

అలాగే జరిగింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 4: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన భారత బ్యాటింగ్ విభాగం తాజాగా శనివారం బెంగళూరులో ప్రారంభమైన రెండో టెస్టులోనూ అదేవిధంగా విఫలమైంది. 50 పరుగులకే 8 వికెట్లను కైవసం చేసుకుని టీమిండియా పతనాన్ని శాసించిన ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలింది. పుణెలో మాదిరిగానే బెంగళూరులోని చిన్నస్వామి పిచ్‌ని కూడా ఎంతో ప్రమాదకరంగా రూపొందించడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఒకానొక దశలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించిన భారత జట్టు కేవలం 9.3 ఓవర్లలో 15 పరుగులకే మిగిలిన ఐదు వికెట్లను చేజార్చుకుని భారీ మూల్యం చెల్లించుకుంది. అయితే ఓపెనర్ లోకేష్ రాహుల్ ఒక్కడే స్థిరంగా ఆడి 90 పరుగుల వ్యక్తిగత స్కోరుతో కొంతలో కొంత టీమిండియా పరువును కాపాడాడు. ఆ తర్వాత తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ నష్టపోకుండా 40 పరుగులు సాధించింది. ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (23), మ్యాట్ రెన్షా (15) ఆదివారం ఆసీస్ ఇన్నింగ్స్‌ను కొనసాగించనున్నారు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్ లోకేష్ రాహుల్‌ను భుజం నొప్పి వేధించినప్పటికీ చక్కటి ప్రదర్శనతో ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించాడు. అతడు మినహా మిగిలిన టీమిండియాలో మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్ద స్కోర్లు సాధించలేకపోయారు. 205 బంతులను ఎదుర్కొన్న లోకేష్ రాహుల్ ఐదు బౌండరీల సహాయంతో 90 పరుగులు సాధించి నాథన్ లియోన్ బౌలింగ్‌లో మ్యాట్ రెన్షాకు క్యాచ్ ఇవ్వగా, మిగిలిన భారత బ్యాట్స్‌మెన్‌లో కరుణ్ నాయర్ (26) ఒక్కడే 20 కంటే ఎక్కువ పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు.
పుణె టెస్టులో స్టీవ్ ఒకీఫ్ 12 వికెట్లతో సత్తా చాటుకుని టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను వరుసగా పెవిలియన్‌కు చేర్చగా ఇప్పుడు బెంగళూరులో ఆ పనిని నాథన్ లియోన్ చేశాడు. లోకేష్ రాహుల్‌తో పాటు చటేశ్వర్ పుజారా (17), కెప్టెన్ విరాట్ కోహ్లీ (12), అజింక్యా రహానే (17), రవిచంద్రన్ అశ్విన్ (7), వృద్ధిమాన్ సాహా (1), రవీంద్ర జడేజా (3), ఇశాంత్ శర్మ (0) లను పెవిలియన్‌కు చేర్చిన లియోన్ 50 పరుగులకే 8 వికెట్లు కైవసం చేసుకుని కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకోవడంతో పాటు భారత్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్న విదేశీ బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు. అంతేకాకుండా ఆసీస్ స్పీడ్‌స్టర్ బ్రెట్‌లీని అధిగమించి టెస్టుల్లో భారత్‌పై అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ (సి) రెన్షా (బి) లియోన్ 90, అభినవ్ ముకుంద్ ఎల్‌బిడబ్ల్యు (బి) స్టార్క్ 0, చటేశ్వర్ పుజారా (సి) హ్యాండ్స్‌కూంబ్ (బి) లియోన్ 17, విరాట్ కోహ్లీ ఎల్‌బిడబ్ల్యు (బి) లియోన్ 12, అజింక్యా రహానే (స్టంప్డ్) వేడ్ (బి) లియోన్ 17, కరుణ్ నాయర్ (స్టంప్డ్) వేడ్ (బి) ఒకీఫ్ 26, రవిచంద్రన్ అశ్విన్ (సి) వార్నర్ (బి) లియోన్ 7, వృద్ధిమాన్ సాహా (సి) స్మిత్ (బి) లియోన్ 1, రవీంద్ర జడేజా (సి) స్మిత్ (బి) లియోన్ 3, ఉమేష్ యాదవ్ నాటౌట్ 0, ఇశాంత్ శర్మ (సి) హ్యాండ్స్‌కూంబ్ (బి) లియోన్ 0, ఎక్స్‌ట్రాలు: (బైస్ 12, లెగ్‌బైస్ 4) 16, మొత్తం: 71.2 ఓవర్లలో 189 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-11, 2-72, 3-88, 4-118, 5-156, 6-174, 7-178, 8-188, 9-189, 10-189.
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 15-5-39-1, జోష్ హాజెల్‌వుడ్ 11-2-42-0, స్టీవ్ ఒకీఫ్ 21-5-40-1, మిచెల్ మార్ష్ 2-0-2-0, నాథన్ లియోన్ 22.2-4-50-8
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ నాటౌట్ 23, మ్యాట్ రెన్షా నాటౌట్ 15, ఎక్స్‌ట్రాలు: (నోబాల్స్ 2) 2, మొత్తం: 16 ఓవర్లలో 40/0.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 5-0-8-0, ఉమేశ్ యాదవ్ 4-1-16-0, రవిచంద్రన్ అశ్విన్ 6-0-11-0, రవీంద్ర జడేజా 1-0-5-0.

చిత్రాలు....టీమిండియాలో ఒకే ఒక్కడు.. లోకేష్ రాహుల్ (90 పరుగులు
*నాథన్ లియోన్.. 8 వికెట్లతో సత్తా చాటెన్