క్రీడాభూమి

బిసిసిఐ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించనున్న రాష్ట్ర సంఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: బెంగళూరులో ఈ నెల 8వ తేదీన జరుగనున్న క్రికెట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అనుంబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు బహిష్కరించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి బిసిసిఐ ‘షరతుల’తో కూడిన ఆహ్వానాలను పంపడమే ఇందుకు కారణం. ‘సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అర్హులైన ఆఫీసు బేరర్లు మాత్రమే ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలసిందిగా తెలియజేస్తున్నాం’ అని బిసిసిఐ పాలక కమిటీ (సిఓఎ) ఆ ఆహ్వానాల్లో స్పష్టం చేసింది. దీంతో ఈ ఆహ్వానాల్లో ఉపయోగించిన పదజాలం పట్ల గుర్రుగా ఉన్న చాలా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని యోచిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే బిసిసిఐ చరిత్రలో ఇటువంటి ఘటన ఇదే మొదటిది అవుతుంది. బెంగళూరులో ఈ నెల 8వ తేదీన జరుగనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పాలీ ఉమ్రిగర్ అవార్డుతోనూ, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను దిలీప్ సర్దేశాయ్ అవార్డుతోనూ సత్కరించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాల్లో షరతులను పొందుపర్చడం భావ్యం కాదని, ఈ కార్యక్రమానికి తమతమ ప్రతినిధులను పంపే విచక్షణాధికారం ఎన్నికైన క్రికెట్ సంఘాలకు తప్పకుండా ఉంటుందని ఒక రాష్ట్ర క్రికెట్ సంఘ సభ్యుడు స్పష్టం చేశాడు.