క్రీడాభూమి

శామ్ క్వెరీ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అకాపల్కో (మెక్సికో), మార్చి 5: మెక్సికో ఓపెన్ ఎటిపి టెన్నిస్ టోర్నమెంట్‌లో అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు శామ్ క్వెరీ సంచలనం సృష్టించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 40వ స్థానంలో కొనసాగుతున్న అతను పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన రెండో సీడ్ ఆటగాడు రాఫెల్ నాదల్‌ను 6-3, 7-6(7/3) వరుస సెట్ల తేడాతో మట్టికరిపించి టైటిల్‌ను ఎగరేసుకు పోయాడు. దీంతో మెక్సికో ఓపెన్‌లో నాదల్ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. నాదల్‌తో ఇప్పటివరకూ ఐదుసార్లు తలపడిన శామ్ క్వెరీకి ఇదే తొలి విజయం. ఈ విజయాన్ని సాధించే క్రమంలో అతను అద్భుతమైన పవర్‌ఫుల్ షాట్లు, కచ్చితమైన గ్రౌండ్ స్ట్రోక్‌లతో విజృంభించి 19 ఏస్‌లను సంధించడం విశేషం. మెక్సికో ఓపెన్‌లో రెండుసార్లు (2005, 2013 సంవత్సరాల్లో) చాంపియన్‌గా నిలవడంతో పాటు గతంలో ఎన్నడూ కనీసం ఒక్క సెట్‌ను కూడా చేజార్చుకోని నాదల్‌పై ఇంత గొప్ప విజయాన్ని సాధించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని, ఈ టోర్నమెంట్ తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని శామ్ క్వెరీ హర్షాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కెరీర్‌లో 9వ ఎటిపి టైటిల్‌ను గెలుచుకున్న శామ్ క్వెరీ ఈ క్రమంలో ఈ వారం టాప్-10లోని నలుగురు క్రీడాకారులను (బెల్జియంకు చెందిన డేవిడ్ గోఫిన్, ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థియెమ్, ఆస్ట్రేలియాకి చెందిన నిక్ కిర్గియోస్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో కొనసాగుతున్న ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌లను) మట్టికరిపించాడు. దీంతో సోమవారం వెలువడనున్న ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో శామ్ క్వెరీకి టాప్-30 జాబితాలో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.