క్రీడాభూమి

బ్యాటింగ్ లైనప్‌లో లోపం లేదు : పుజారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 5: ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకు భారత బ్యాట్స్‌మెన్ కకావికలవుతున్నప్పటికీ తమ బ్యాటింగ్ లైనప్‌లో ఎలాంటి లోపమూ లేదని చటేశ్వర్ పుజారా అంటున్నాడు. పుణెలో జరిగిన తొలి టెస్టులో ఘోరపరాజయం పాలయిన తర్వాత ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో కూడా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలవుట్ అయిన విషయం తెలిసిందే. మరో ఆస్ట్రేలియా ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో 48 పరుగుల ఆధిక్యత సంపాదించగా, ఇంకా నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి. అయితే మూడు ఇన్నింగ్స్‌లో విఫలమైనంతమాత్రాన తమను చెత్త ఆటగాళ్లుగా ముద్ర వేయడం తగదని పుజారా అంటున్నాడు. ‘అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే భారీ భాగస్వామ్యం లేకపోవడం. వరసగా వికెట్లు కోల్పోతూ వచ్చాం. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో ఎలాంటి లోపమూ లేదు. ఈ మూడు ఇన్నింగ్స్‌లో తప్పిస్తే స్పిన్నర్లపై బాగా ఆడే వాళ్లుగా మాకు గుర్తింపు ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో మరింత మెరుగైన వ్యూహాన్ని రూపొందించుకుంటాం. మేము రాణిస్తామన్న నమ్మకం ఉంది’ అని ఆదివారం రెండో రోజు ఆట తర్వాత మీడియాతో మాట్లాడుతూ పుజారా చెప్పాడు. అంతేకాదు తాము ఆధిపత్యం పూర్తిగా కోల్పోలేదని కూడా పుజారా వాదించాడు. అంతేకాదు, నిజానికి మన బౌలర్లు ఈ రోజు చాలా బాగా బౌల్ చేశారని కూడా అన్నాడు. పెద్దగా పరుగులివ్వకుండా చక్కటి లైన్‌అండ్ లెంగ్త్‌తో బౌల్ చేయడమే కాకుండా ఆరు వికెట్లు కూడా తీశారని చెప్పాడు. జట్టు బలంగా ఉందని చెప్పిన అతను ఈ టెస్టు మ్యాచ్‌లో తాము తప్పకుండా పుంజుకుంటామని తాను గట్టిగా భావిస్తున్నానని తెలిపాడు.