క్రీడాభూమి

వనే్డ సిరీస్ ఇంగ్లాండ్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంటిగ్వా, మార్చి 6: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ వనే్డ క్రికెట్ సిరీస్‌ను ఇంగ్లాండ్ జట్టు కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఆతిథ్య వెస్టిండీస్‌ను ఓడించిన ఇంగ్లాండ్ తాజాగా ఆంటిగ్వాలో జరిగిన రెండో వనే్డలోనూ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను గెలుచుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్లను ఇంగ్లాండ్ బౌలర్లు లియామ్ ప్లంకెట్ (3/32), స్టీవెన్ ఫిన్ (2/38), ఆదిల్ రషీద్ (2/53) పదునైన బంతులతో సమర్థవంతంగా ప్రతిఘటించారు. వీరి జోరును ప్రతిఘటించడంలో విండీస్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్, మిడిలార్డర్‌లో జాసన్ మొహమ్మద్ (50), జొనాథన్ కార్టర్ (39) మినహా మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోవడంతో వెస్టిండీస్ 47.5 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శామ్ బిల్లింగ్స్ (0), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (7), బెన్ స్టోక్స్ (1), జోస్ బట్లర్ (0), మొరుూన్ అలీ (3) విఫలమైనప్పటికీ ఓపెనర్ జాసన్ రాయ్ (52), జో రూట్ (90-నాటౌట్), క్రిస్ వోక్స్ (68-నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. దీంతో 48.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ జట్టు మరో 10 పరుగులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

చిత్రం..‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జో రూట్