క్రీడాభూమి

మహిళల హాకీలో భారత్ జైత్రయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మార్చి 6: బెలారస్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు టెస్టుల హాకీ సిరీస్‌లో భారత మహిళా జట్టు వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకెళ్తోంది. రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆతిథ్య భారత జట్టు సోమవారం ఇక్కడ జరిగిన నాలుగో మ్యాచ్‌లోనూ 2-1 గోల్స్ తేడాతో బెలారస్‌ను మట్టికరిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచే విజృంభించి ఆడిన భారత జట్టుకు రేణుకా యాదవ్ 6వ నిమిషంలోనే అద్భుతమైన ఫీల్డ్ గోల్‌ను అందించగా, ఆ తర్వాత గుర్జీత్ కౌర్ 12వ నిమిషంలో మరో గోల్‌ను అందించింది. దీంతో తొలి క్వార్టర్ ముగిసే సమయానికే భారత జట్టు 2-0 గోల్స్ తేడాతో పటిష్టమైన స్థితికి చేరుకుంది. అయితే 21వ నిమిషంలో నస్తాసియా సిరయెజ్కా పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి బెలారస్‌కు కాస్త ఊరట కల్పించింది. ఆ తర్వాత పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో ఆడి చివరిదాకా బెలారస్‌ను నిలువరించిన భారత జట్టు 2-1 గోల్స్ తేడాతో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది.