క్రీడాభూమి

అవి అసంబద్ధ ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 9: తమ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌పై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంబద్ధమైన ఆరోపణలు చేశాడని, నిజానికి వాటిలో పస లేదని ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేవిడ్ సాకెర్ ధ్వజమెత్తాడు. డిఆర్‌ఎస్ అప్పీల్స్‌కు వెళ్లే ప్రతిసారీ డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూస్తూ, అక్కడి నుంచి సూచనల కోసం స్మిత్ ఎదురుచూస్తున్నాడని కోహ్లీ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై సాకెర్ స్పందిస్తూ, కోహ్లీ మాటల్లో ఏమాత్రం నిజం లేదని అన్నాడు. స్మిత్ ఎన్నడూ సపోర్టింగ్ స్ట్ఫా సూచనలను కోరలేదని చెప్పాడు. ఇక ముందు కూడా సలహాలు అడగబోరని స్పష్టం చేశాడు. కోహ్లీ ఆరోపణలు తమను మానసికంగా దెబ్బతీసేవిగానూ, ఎదురుదాడికి ఉద్దేశించినవిగానూ ఉన్నాయని వ్యాఖ్యానించాడు. ఇలాంటి ఆరోపణలను మానుకోవాలని అతను కోహ్లీకి సూచించాడు.