క్రీడాభూమి

వెనక్కుతగ్గే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 11: స్పిన్‌కు అనుకూలిస్తున్న భారత పిచ్‌లపై భారీ షాట్లకు ప్రయత్నించి, తక్కువ స్కోర్లకే అవుటవుతున్నప్పటికీ, వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఆస్ట్రేలియా ఓపెన్ డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. ప్రస్తుత టూర్‌లో అతను టెస్టుల్లో మూడు పర్యాయాలు అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన అతను ఉమేష్ యాదవ్ చేతిలో అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే అశ్విన్‌కు ఎల్‌బిగా చిక్కాడు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగుల చేసి, అశ్విన్ చేతిలోనే ఎల్‌బిగా వెనుదిరిగాడు. బంతి విపరీతంగా స్పిన్ కావడం, ఎంత ఎత్తులో దూసుకొస్తుందో తెలియకపోవడం వార్నర్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్యలు. భారీ షాట్లు కొట్టే అలవాటున్న అతను అశ్విన్ బౌలింగ్‌లో అదే తరహా ఆటకు ప్రయత్నించి, మూల్యాన్ని చెల్లించుకున్నాడు. బంతి దిశను అర్థం చేసుకోలేకపోవడంతోపాటు, ఎక్కువ మంది ఫీల్డర్లు చుట్టుముట్టడం కూడా వార్నర్ సమస్యలను పెంచుతున్నది. భారత బౌలింగ్‌ను, ప్రధానంగా అశ్విన్ స్పిన్‌ను ఎదుర్కోవడంలో విఫలమవుతున్న విషయాన్ని ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వార్నర్ అంగీకరించాడు. అయితే, తన దూకుడును తగ్గించునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. ఈ సీజన్‌లో మూడుసార్లు, మొత్తం మీద ఇప్పటి వరకూ తొమ్మిదిసార్లు అశ్విన్ తనను అవుట్ చేసిన విషయాన్ని అతను ప్రస్తావించాడు. అశ్విన్‌ను ప్రతిభావంతుడైన ఆటగాడంటూ ప్రశంసించాడు. అయితే, తనదైన శైలిలో ఆడకుండా, బ్యాటింగ్ విధానాన్ని మార్చుకోబోనని స్పష్టం చేశాడు. బంతి ఎంత ఎత్తులో వస్తుందనేది అంచనాకు దొరకడం లేదని అన్నాడు. షాట్‌కు ప్రయత్నించకుండా రక్షణాత్మకంగా ఆడినా, ఎల్‌బిగా అవుటయ్యే ప్రమాదం ఉంటుందన్నాడు. ఈ పరిస్థితుల్లో, స్వతఃసిద్ధమైన ఆటకు ప్రాధాన్యమిస్తానని తెలిపాడు. ఈ సిరీస్‌లో జరగాల్సిన మిగతా రెండు టెస్టులు ఉత్కంఠ భరితంగా సాగుతాయని వార్నర్ జోస్యం చెప్పాడు.