క్రీడాభూమి

సెమీస్‌కు బరోడా, తమిళనాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, మార్చి 12: విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో బరోడా, తమిళనాడు జట్లు సెమీస్‌కు దూసుకెళ్లాయి. మొదటి క్వార్టర్ ఫైనల్‌లో కర్నాటకను ఢీకొన్న బరోడా 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్నాటక 48.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. పవన్ దేశ్‌పాండే (54) అర్ధశతకంతో రాణించగా, మాయాంక్ అగర్వాల్ (40), రవికుమార్ సమర్థ్ (44) మెరుగైన స్కోర్లు చేశారు. బరోడా బౌలర్లలో కృణాల్ పాండ్యకు మూడు వికెట్లు లభించాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బరోడా 45.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 234 పరుగులు సాధించి, 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. కేదార్ దేవధర్ 78 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో రాణించి 2 వికెట్లు పడగొట్టిన కృణాల్ పాండ్య బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి 70 పరుగులు సాధించాడు.
రెండో క్వార్టర్ ఫైనల్‌లో రంజీ ట్రోఫీ చాంపియన్ గుజరాత్‌ను తమిళనాడు ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 49.4 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. రుజుల్ భట్ అజేయంగా 83 పరుగులు సాధించాడు. సమిత్ గొహెల్ 39 పరుగులు చేయగా, తమిళనాడు కెప్టెన్ విజయ్ శంకర్ 48 పరుగులకు 3 వికెట్లు కూల్చాడు. రాహిల్ షా, సాయి కిషోర్ చెరి 2 వికెట్లు పడగొట్టారు. కాగా, లక్ష్యాన్ని తమిళనాడు 42.2 ఓవర్లలో 5 వికెట్లు చేజార్చుకొని ఛేదించింది. గంగా శ్రీ్ధర్ రాజు 85 పరుగులు చేసి, తమిళనాడు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరిలో మహమ్మద్ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.