క్రీడాభూమి

‘స్లెడ్జింగ్’కు అడ్డుకట్టే కోహ్లీ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 14: తిట్ల దండకం చదవడం, చులకనగా మాట్లాడడం, హేళన చేయడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం, అవమానించే రీతిలో సైగలు చేయడం వంటి చర్యలతో ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడంలో ఆస్ట్రేలియాను మించిన జట్టు లేదు. మైదానంలో విపరీత ధోరణకులకు కారణమైన ‘స్లెడ్జింగ్’తో ఆసీస్ రెచ్చిపోతే, ఇంగ్లాండ్, వెస్టిండీస్ తదితర జట్లు కూడా తాము తక్కువేమీ కాదన్న రీతిలో ప్రవర్తిస్తున్నాయ. అయతే, అరుదుగా జరిగిన సంఘటనలను మినహాయస్తే, భారత క్రికెటర్లు ‘స్లెడ్జింగ్’కు పాల్పడిన సందర్భాలు లేవు. ప్రత్యర్థులు ఎంతగా రెచ్చగొట్టినా భారత ఆటగాళ్లు సంయమనం పాటించేవారు. మాటకు మాట చెప్పడం కంటే, ప్రత్యర్థుల సవాళ్లకు ఆటతోనే సమాధానం చెప్పాలన్న సూత్రాన్ని టీమిండియా ఆచరిస్తూ వచ్చింది. అయతే, సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితి మారింది. ప్రత్యర్థులు ‘స్లెడ్జింగ్’కు దిగితే, భారత క్రికెటర్లు దీటుగా సమాధానం చెప్పడం, సై అంటే సై అనడం మొదలైంది. ‘మిస్టర్ కూల్’గా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు టీమిండియా ఎదురుదాడి తగ్గినట్టు కనిపించింది. కానీ, నివురుగప్పిన నిప్పులా ఉన్న భారత జట్టు విరాట్ కోహ్లీ కెప్టెన్సీతో మళ్లీ దూకుడును ప్రదర్శిస్తున్నది. ‘స్లెడ్జింగ్’ చేస్తే, ఎదురుసమాధానం చెప్పకుండా ఊరుకునే లక్షణం లేని కోహ్లీ మైదానంలో దూకుడుగా ఉండడానికే ఇష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియా వంటి జట్లతో దూకుడుగా వ్యవహరించడమే సరైన వ్యూహమని నమ్మిన అతను ప్రస్తుత టెస్టు సిరీస్‌లో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. నిజానికి ‘జంటిల్మన్ గేమ్’ క్రికెట్‌ను ‘స్లెడ్జింగ్’ ఒక వీధి పోరాటంగా మార్చేసింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు వీరావేశంతో మరో అడుగు ముందుకేసి, ముష్టియుద్ధాలకు దిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయ. అందుకే, వారి కంటే ముందు తానే మాటల దాడి చేయడమే సరైన విధానమని కోహ్లీ భావిస్తున్నాడని చెప్పడానికి రెండో టెస్టు సందర్భంగా చోటు చేసుకున్న డిఆర్‌ఎస్ వివాదమే నిదర్శనం. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటైనప్పటికీ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెస్ స్మిత్ మైదానాన్ని వీడకుండా, అక్కడే తచ్చాడడమేగాక, డిఆర్‌ఎస్‌కు అప్పీల్ చేయాలా వద్దా అన్న విషయంపై సపోర్టింగ్ స్టాప్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూడడాన్ని కోహ్లీ తప్పుపట్టాడు. స్మిత్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడని ఆరోపించిన అతను ఆసీస్ జట్టును పూర్తిగా డిఫెన్స్‌లోకి నెట్టేశాడు. మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌కు చేసిన ఫిర్యాదును బిసిసిఐ వాపసు తీసుకోవడం, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కూడా ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదని ప్రకటించడం ఈ వివాదానికి తెరదించాయ. అయతే, దెబ్బతిన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు మిగతా రెండు టెస్టుల్లో ‘స్లెడ్జింగ్’కు దూరంగా ఉంటారని అనుకోవడానికి వీల్లేదు. కోహ్లీ కూడా ఏమీ జరగనట్టే వ్యవహరిస్తాడని ఊహించలేం.
సాధారణంగా బ్యాట్స్‌మెన్‌ను ఫీల్డర్లు ‘స్లెడ్జింగ్’ చేస్తారు. ఫీల్డింగ్ చేసే జట్టు తరఫున 11 మంది మైదానంలో ఉంటే, బ్యాటింగ్‌కు దిగిన జట్టు తరఫున ఇద్దరే క్రీజ్‌లో ఉంటారు. దీనిని అవకాశంగా తీసుకొని, వారి ఆత్మవిశ్వాసాన్ని, వారి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు చేసే ఫీల్డర్లు ప్రయత్నించడం సహజం. బెంగళూరు టెస్టులోనూ జరిగింది దాదాపుగా ఇదే. స్మిత్ స్ట్రయకింగ్ చేస్తున్నప్పుడు, ఎల్‌బి నిర్ణయంపై డిఆర్‌ఎస్‌కు వెళ్లే విషయాన్ని నాన్‌స్ట్రయకింగ్ ఎండ్‌లో ఉన్న పీటర్ హ్యాండ్స్‌కోమ్‌తో స్మిత్ చర్చించడమే వివాదానికి ప్రధాన కారణమైంది. ఈ సంఘటన కోహ్లీని విజేతగా నిలబెడితే, స్మిత్ సర్వత్రా విమర్శలకు గురవుతున్నాడు. మాథ్యూ హేడెన్ వంటి మాజీ క్రికెటర్లు కూడా కోహ్లీకే మద్దతు ప్రకటించడం స్మిత్ పరిస్థితికి అద్దం పడుతుంది. మరోవైపు అంతర్జాతీయంగా కూడా ఈ డిఆర్‌ఎస్ వివాదం చర్చనీయాంశమైంది. దీనిని చాలా మంది నిబంధనల అతిక్రమణకు సంబంధించిన అంశంగా భావిస్తుంటే, దీనినీ ఒకరకమైన ‘స్లెడ్జింగ్’గా కొంత మంది అభివర్ణిస్తున్నారు. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడం, బూతులు తిట్టుకోవడం వంటి చర్యలకు పాల్పడే ఆస్ట్రేలియా క్రికెటర్లకు సరైన సమాధానం చెప్పడానికే కోహ్లీ వ్యూహాత్మకంగా చిన్నపాటి సంఘటనకు భూత ద్దంలో పెట్టి చూపెట్టి, స్మిత్‌ను పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాడు. ఒక రకంగా చెప్పాలంటే, ఆసీస్ ఆటగాళ్లు ‘స్లెడ్జింగ్’కు దిగకుండా అడ్డుకోవడమే కోహ్లీ వ్యూహం. ‘స్లెడ్జింగ్’కు గురైన ఆటగాళ్లు కసితో చెలరేగిపోతారని, ఫలితంగా ఒక్కోసారి మ్యాచ్ ఫలితమే తారుమారవుతుందనే వాదన కూడా ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా అలాంటి సాహసం చేస్తుందని అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ స్మిత్ సేన కూడా ఎదురుదాడికి పూనుకుంటే, మిగతా రెండు టెస్టుల్లో క్రికెట్ మైదానాలు యుద్ధ భూములుగా మారడం ఖాయం. ఇరు జట్ల ఆటగాళ్లు మాటల ఈటెలు విసురుకోవడం, ఒకరినొక్కరు రెచ్చగొట్టుకోవడం, ఘర్షణ పడడం క్రికెట్‌లో సహజమే.
కానీ, ఏదైనా హద్దులు దాటనంత వరకే బాగుంటుంది. వ్యక్తిగత జీవితాలు, అసహ్యకరమైన వ్యాఖ్యానాలు క్రీడాస్ఫూర్తిని దెబ్బతీస్తాయి. ఆటగాళ్లు బద్ధ శత్రువులుగా మారిపోతారు. ‘స్లెడ్జింగ్’ తీవ్రం కావడానికి, ఎవరూ హర్షించని రీతిలో వివాదాలో చోటు చేసుకోవడానికి ఆస్ట్రేలియా వ్యవహార శైలే ప్రధాన కారణమన్నది అందరికీ తెలిసిన సత్యం. స్వదేశంలో టీమిండియా రెచ్చిపోకుండా ఉండాలంటే ‘స్లెడ్జింగ్’కు పాల్పడడం తప్ప మరో మార్గం లేదని ఆసీస్ ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. అయితే, ఆ సూత్రాన్ని కోహ్లీ అమలు చేశాడు. డిఆర్‌ఎస్ ఉదంతాన్ని కూడా ఒక రకంగా ‘స్లెడ్జింగ్’గా పేర్కోవచ్చు. ఈ వివాదానికి తెరపటినట్టు కనిపిస్తున్నా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే, కోహ్లీ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. స్మిత్‌పై విమర్శలు గుప్పించి, పైచేయి సాధించాడు. ఆస్ట్రేలియాను కట్టడి చేయాలంటే ఈ మాత్రం దూకుడు అవసరమే!