క్రీడాభూమి

స్మిత్ 117 నాటౌట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 16: భారత్‌తో గురువారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సూపర్ సెంచరీ సాధించి, క్రీజ్‌లో నిలవగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు నాలుగు వికెట్లకు 299 పరుగులు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 పరుగుల స్కోరువద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది. అతను 26 బంతుల్లో 19 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. జట్టు స్కోరుకు మరో 30 పరుగులు జత కలిసిన తర్వాత మాట్ రెన్‌షా కూడా పెవిలియన్ చేరాడు. అతను 69 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి చిక్కాడు. మరో తొమ్మిది పరుగులకే ఆస్ట్రేలియా మూడో వికెట్‌ను కోల్పోయింది. షాన్ మార్ష్ కేవలం రెండు పరుగులు చేసి చటేశ్వర్ పుజారా క్యాచ్ పట్టగా రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ చేశాడు. తక్కువ వ్యవధిలోనే మూడు వికెట్లు పడిపోయిన నేపథ్యంలో స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. పీటర్ హ్యాండ్స్‌కోమ్ 47 బంతుల్లో 19 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్‌ను ఆదుకునే బాధ్యతను కెప్టెన్ స్మిత్‌తో కలిసి స్వీకరించిన గ్లేన్ మాక్స్‌వెల్ అర్ధ శతకంతో రాణించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 4 వికెట్లకు 299 పరుగులు సాధించింది. స్మిత్ 244 బంతులు ఎదుర్కొని 117 (13 ఫోర్లు), మాక్స్‌వెల్ 147 బంతుల్లో 82 (5 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఉమేష్ యాదవ్‌కు రెండు వికెట్లు లభిస్తే, అశ్విన్, రవీంద్ర జడేజా చెరొక వికెట్ కూల్చారు.
కెరీర్‌లో 19వ టెస్టు సెంచరీని నమోదు చేసిన స్మిత్ తన 97వ ఇన్నింగ్స్‌లో 5,000 పరుగులు మైలురాయిని అధిగమించాడు. టెస్టుల్లో వేగంగా ఐదు వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఏడో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతేగాక, భారత్‌లో ఒకే సిరీస్‌లో రెండు లేదా అంతకు మించి సెంచరీ చేసిన మూడో విదేశీ కెప్టెన్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఇంతకు ముందు క్లయివ్ లాయిడ్ (వెస్టిండీస్), అలస్టర్ కుక్ (ఇంగ్లాండ్) ఈ విధంగా ఒకే సిరీస్‌లో రెండు లేదా అంతకు మించి సెంచరీలు చేశాడు. ఈ సిరీస్ మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 109 పరుగులు చేసిన స్మిత్ తాజాగా 117 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
**

ఆస్ట్రేలియా జట్టుకు ఇది 800వ టెస్టు. ఇంగ్లాండ్ మాత్రమే ఇంత కంటే ఎక్కువ (983) టెస్టులు ఆడింది. అయితే, ఆ జట్టు కంటే ఆస్ట్రేలియా ఖాతాలోనే 26 విజయాలు అధికంగా ఉండడం విశేషం.
డేవిడ్ వార్నర్, మాట్ రెన్‌షా తొమ్మిదో సారి ఒక టెస్టులో ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు యాభై లేదా అంతకు మించి పరుగులు సాధించడం ఇది ఆరోసారి.
**
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్వస్థలమైన రాంచీలో మొట్టమొదటి టెస్టు మ్యాచ్ గురువారం మొదలైంది. సుమారు మూడేళ్ల క్రితమే టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ప్రస్తుతం విజయ్ హజారే టోర్నీలో జార్ఖండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతని జట్టు ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకోవడంతో అతను న్యూఢిల్లీలోనే ఉండిపోయాడు. కాగా, ధోనీ మ్యాచ్ ఆడకపోయనా కనీసం చూసేందుకైనా వస్తాడనుకున్న అభిమానులు నిరాశ చెందారు.

స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: మాట్ రెన్‌షా సి విరాట్ కోహ్లీ బి ఉమేష్ యాదవ్ 44, డేవిడ్ వార్నర్ సి అండ్ బి రవీంద్ర జడేజా 19, స్మిత్ 117 నాటౌట్, షాన్ మార్ష్ సి చటేశ్వర్ పుజారా బి అశ్విన్ 2, హ్యాండ్స్‌కోమ్ ఎల్‌బి ఉమేష్ యాదవ్ 19, గ్లేన్ మాక్స్‌వెల్ 82 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 16, మొత్తం: 90 ఓవర్లలో 4 వికెట్లకు 299.
వికెట్ల పతనం: 1-50, 2-80, 3-89, 4-140.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 15-2-46-0, ఉమేష్ యాదవ్ 19-3-63-2, రవిచంద్రన్ అశ్విన్ 23-3-78-1, రవీంద్ర జడేజా 30-3-80-1, మురళీ విజయ్ 3-0-17-0.

చిత్రం..సెంచరీ హీరో స్టీవెన్ స్మిత్