క్రీడాభూమి

స్మిత్ రికార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 17: టీమిండియాపై భారత్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవెన్ స్మిత్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు మైఖేల్ క్లార్క్ చెన్నైలో 130 పరుగులు సాధించగా, స్మిత్ ఈ మ్యాచ్‌లో 178 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతేగాక, భారత్‌లో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా కూడా అతని పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది. డీన్ జోన్స్ (210), మాథ్యూ హేడెన్ (201) తర్వాత స్మిత్‌దే భారత్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక స్కోరు.
భారత్‌లో జరిగిన టెస్టుల్లో 150 లేదా అంతకు మించి పరుగులు చేసిన ఐదో కెప్టెన్ స్టీవెన్ స్మిత్. ఇంతకు ముందు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ మూడుసార్లు, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్ రెండు పర్యాయాలు ఈ ఫీట్ సాధించారు. అల్విన్ కాళీచరణ్ (వెస్టిండీస్), ఇంజమాముల్ హక్ (పాకిస్తాన్), మైఖేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా) కూడా తమతమ జట్ల కెప్టెన్ల హోదాలో భారత్‌లో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 150కి పైగా పరుగులు చేశారు.
కెరీర్‌లో 19వ టెస్టు సెంచరీ నమోదు చేసిన స్మిత్‌కు టెస్టు కెరీర్‌లో ఇది నాలుగో అత్యుత్తమ స్కోరు. 2015 జూలైలో ఇంగ్లాండ్‌పై లండన్‌లోని లార్డ్స్ మైదానంలో 215 పరుగులు సాధించాడు. 2014 డిసెంబర్‌లో వెస్టిండీస్‌పై కింగ్‌స్టన్‌లో 199, అదే నెలలో భారత్‌పై మెల్బోర్న్‌లో 192 చొప్పున పరుగులు చేశాడు. ఇప్పుడు భారత్‌లో అజేయంగా 178 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతను 361 బంతులు ఎదుర్కొన్నాడు. 2015 కింగ్‌స్టన్ టెస్టులో 199 పరుగులు చేసినప్పుడు కూడా అతను 361 బంతులే ఎదుర్కోవడం గమనార్హం. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అతను ఆడిన అత్యధిక బంతులు ఇవే.

చిత్రం..స్టీవెన్ స్మిత్