క్రీడాభూమి

శ్రీలంక 8 వికెట్లకు 268

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 18: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లకు 268 పరుగులు చేసింది. వికెట్ నష్టం లేకుండా 54 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఉదయం ఆటను కొనసాగించిన లంక 57 పరుగుల వద్ద ఉపుల్ తరంగ (26) వికెట్‌ను కల్పోయింది. ఓపెనర్ దిముత్ కరుణరత్నే క్రీజ్‌లో నిలదొక్కుకొని 126 పరుగులు సాధించగా మిగతావారు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. మొత్తం మీద 8 వికెట్లకు 268 పరుగులు చేసిన లంక తన ప్రత్యర్థి కంటే కేవలం 139 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో చివరి రోజైన ఆదివారం నాటి ఆట అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 113.3 ఓవర్లలో 338 ఆలౌట్ (దినేష్ చండీమల్ 138, ధనంజయ డి సిల్వ 34, నిరోషన్ డిక్‌విల్లా 34, రంగన హెరాత్ 25, సురంగ లక్మల్ 35, మెహదీ హసన్ మీర్జా 3/90, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 2/50, సుభాసిస్ రాయ్ 2/53, షకీబ్ అల్ హసన్ 2/60).
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: 134.1 ఓవర్లలో 467 ఆలౌట్ (తమీమ్ ఇక్బాల్ 49, సౌమ్య సర్కార్ 61, ఇమ్రుల్ కయాస్ 34, సబ్బీర్ రహ్మాన్ 42, షకీబ్ అల్ హసన్ 116, ముష్ఫికర్ రహీం 52, మొసాడెక్ హొస్సేన్ 75, రంగన హెరాత్ 4/82, లక్షణ్ సండాకన్ 3/140).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టం లేకుండా 54 పరుగులు): 100 ఓవర్లలో 8 వికెట్లకు 268 (దిముత్ కరుణరత్నే 126, కుశాల్ మేండిస్ 36, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 3/52, షకీబ్ అల్ హసన్ 3/61).