క్రీడాభూమి

శ్రీలంకపై బంగ్లా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 19: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టును 4 వికెట్ల తేడాతో గెల్చుకున్న బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను డ్రా చేసుకుంది. మొదటి టెస్టులో విజయం సాధించిన లంక, ఈ మ్యాచ్‌ని కూడా తన ఖాతాలో వేసుకొని క్లీన్‌స్వీప్ చేయాలని అనుకుంది. కానీ, బంగ్లాదేశ్ ఎదురుదాడి ముందు నిలవలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 338 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో467 పరుగుల భారీ స్కోరు సాధించింది. 129 పరుగులు వెనుకబడిన లంక రెండో ఇన్నింగ్స్ ఆరంభించి, నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 268 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన ఆదివారం ఉదయం ఆటను కొనసాగించి 319 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ దిముత్ కరుణరత్నే, చివరిలో దిల్‌రువాన్ పెరెరా (50), సురంగ లక్మల్ (42) కొంత సేపు పోరాడినా ఫలితం లేకపోయింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 4, ముస్త్ఫాజుర్ రెహ్మాన్ 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 191 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాదేశ్ 57.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గెలిచింది. ఓపెనర్ తమీమ్ ఇక్మాల్ (82), సబ్బీర్ రహ్మాన్ (41) పరుగులు చేసి, బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించారు.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 113.3 ఓవర్లలో 338 ఆలౌట్ (దినేష్ చండీమల్ 138, సురంగ లక్మల్ 35, మెహదీ హసన్ మీర్జా 3/90, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 2/50, సుభాసిస్ రాయ్ 2/53, షకీబ్ అల్ హసన్ 2/60).
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: 134.1 ఓవర్లలో 467 ఆలౌట్ (తమీమ్ ఇక్బాల్ 49, సౌమ్య సర్కార్ 61, షకీబ్ అల్ హసన్ 116, ముష్ఫికర్ రహీం 52, మొసాడెక్ హొస్సేన్ 75, రంగన హెరాత్ 4/82, లక్షణ్ సండాకన్ 3/140).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 113.2 ఓవర్లలో 319 ఆలౌట్ (దిముత్ కరుణరత్నే 126, దిల్‌రువాన్ పెరెరా 50, సురంగ లక్మల్ 42, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 3/78, షకీబ్ అల్ హసన్ 4/74).
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 191): 57.5 ఓవర్లలో 6 వికెట్లకు 191 (తమీమ్ ఇక్బాల్ 82, సబ్బీర్ రహ్మాన్ 41).