క్రీడాభూమి

చివరి టెస్టులో షమీకి స్థానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, మార్చి 22: ఆస్ట్రేలియాతో ఈనెల 25వ తేదీ, శనివారం నుంచి మొదలయ్యే చివరి, నాలుగో టెస్టులో టీమిండియా మీడియం పేసర్ మహమ్మద్ షమీకి చోటు దక్కే అవకాశాలున్నాయి. నిరుడు నవంబర్‌లో ఇంగ్లాండ్‌తో మొహాలీలో మూడో టెస్టు ఆడుతున్న సమయంలో షమీ మోకాలికి గాయమైంది. దీనితో అతను మిగతా రెండు టెస్టుల్లో ఆడలేదు. ఆస్ట్రేలియాతో ఇంత వరకూ జరిగిన మూడు టెస్టుల్లోనూ అతనికి స్థానం లభించలేదు. అయితే, ఇటీవల ముగిసిన విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడిన అతను మూడు గ్రూప్ మ్యాచ్‌లు ఆడాడు. మొదటి మ్యాచ్‌లో 63 పరుగులకు మూడు, రెండో మ్యాచ్‌లో 37 పరుగులిచ్చి రెండు చొప్పున వికెట్లు పడగొట్టాడు. చివరి మ్యాచ్‌లో ఏడు ఓవర్లు బౌల్ చేసి 36 పరుగులిచ్చాడు. కానీ, అతనికి వికెట్ లభించలేదు. అయితే, తమిళనాడుతో జరిగిన ఫైనల్‌లో 26 పరుగులకే నాలుగు వికెట్లు సాధించి సత్తా చాటాడు. అతను గొప్పగా రాణించినా, జట్టు మొత్తం సమష్టిగా రాణించలేకపోవడంతో, తమిళనాడు చేతిలో బెంగాల్‌కు ఓటమి తప్పలేదు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 22 టెస్టులు ఆడిన షమీ 76 పరుగులు కూల్చాడు. గాయం బాధలు లేవని విజయ్ హజారే టోర్నీలో నిరూపించుకోవడంలో, చివరి టెస్టులో ఆడే అవకాశం అతనికి దక్కుతుందన్న వాదన బలంగా వినిపిస్తున్నది.