క్రీడాభూమి

ఖాతాల్లో డబ్బున్నా నిధులకు దరఖాస్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: కొన్ని సభ్య సంఘాలు ఒకవైపు భారీ మొత్తాల్లో నిధులు ఉంచుకొని, మరోవైపు నిధుల కోసం దరఖాస్తులు చేసుకున్నాయని సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో పాలనాధికారుల కమిటీ (సిఒఎ) పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పిసిఎ), సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్‌సిఎ) పెట్టుకున్న దరఖాస్తులను ఆ నివేదికలో పేరొంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం నుంచి ప్రారంభమయ్యే చివరి, నాలుగో టెస్టు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగాలంటే, ఖర్చులకు డబ్బులివ్వాలంటూ హెచ్‌పిసిఎ దరఖాస్తు చేసుకుందని, అయితే, ఆ సంఘం ఖాతాలో 65 కోట్ల రూపాయలకుపైగా మిగులు నిధులు ఉన్నాయని వివరించింది. అదే విధంగా ఎస్‌సిఎ ఖాతాలో 255 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ, ఆ సంఘం కూడా ఐపిఎల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరిందని సిఒఎ తన నివేదికలో పేర్కొంది. టెస్టు నుంచి ఐపిఎల్ వరకూ ఏ ఫార్మాట్‌లోనైనా మ్యాచ్‌లను నిర్వహించే ఆర్థిక బలం ఉన్న సంఘాలు నిధులను కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
చౌదరి అడ్డుపడుతున్నాడు..
కోర్టుల్లో ఉన్న వివిధ కేసులకు సంబంధించి న్యాయవాదుల బృందాన్ని ఎంపిక చేయడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు బిసిసిఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరీ అడ్డుపడుతున్నాడని సిఒఎ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. బోర్డు పాలనా వ్యవహారాలు సజావుసగా సాగకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని సిఒఎ పేర్కొంది.