క్రీడాభూమి

ధోనీ, కోహ్లీకి ‘ఎ’ గ్రేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 22: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి గ్రేడ్ ‘ఎ’ కాంట్రాక్టు లభించింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) బుధవారం సెంట్రల్ కాంట్రాక్టులను ఖరారు చేసింది. ఆటగాళ్ల కాంట్రాక్టు ఫీజును భారీగా పెంచింది. కోహ్లీ, ధోనీసహా మొత్తం ఏడుగురికి ‘ఎ’ గ్రేడ్‌లో కాంట్రాక్టు లభించింది. ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లకు ఇకపై రెండు కోట్ల రూపాయల ఫీజు లభిస్తుంది. గ్రేడ్ ‘బి’ కాంట్రాక్టును తొమ్మిది మందికి బిసిసిఐ ప్రకటించింది. వీరిలో రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, యువరాజ్ సింగ్ తదితరులు ఉన్నారు. ఈ జాబితాలోని ఆటగాళ్లకు ఫీజు రూపంలో కోటి రూపాయలు లభిస్తాయి. కాగా, యాభై లక్షల విలువ చేసే ‘సి’ గ్రేడ్ కాంట్రాక్టుకు మొత్తం 16 మందిని బిసిసిఐ ఎంపిక చేసింది. శిఖర్ ధావన్, రిషభ్ పంత్ తదితరులు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. మొత్తం మీద తాజా కాంట్రాక్టులు 32 మంది క్రికెటర్లకు లభించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి ఎదిగిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ‘సి’ గ్రేడ్ నుంచి ‘ఎ’ గ్రేడ్‌కు ప్రమోషన్ సంపాదించాడు. ఇలావుంటే, సెంట్రల్ కాంట్రాక్టు పొందిన క్రికెటర్ల ఫీజు భారీగా పెరిగాయి. బిసిసిఐ ఇది వరకే చేసిన ప్రతిపాదనలకు, పాలనా వ్యవహారాలను పరిశీలించడానికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నలుగు సభ్యులతో కూడిన కమిటీ (సిఒఎ) ఆమోద ముద్ర వేయడంతో, ఆటగళ్ల ఫీజు ఒక్కసారిగా పెరిగింది. ఇంత వరకూ అమల్లో ఉన్న కాంట్రాక్టు ప్రకారం గ్రేడ్ ‘ఎ’ ఆటగాళ్లకు ఏటా కోటి రూపాయల ఫీజు లభించేది. అదే విధంగా ‘బి’ గ్రేడ్ క్రికెటర్లకు 60 లక్షలు, ‘సి’ గ్రేడ్‌లో ఉన్నవారికి 35 లక్షల చొప్పున ఫీజు చెల్లించేవారు. ఇప్పుడు ‘ఎ’ గ్రేడ్‌కు రెండు కోట్లు, ‘బి’ గ్రేడ్‌కు ఒక కోటి, ‘సి’ గ్రేడ్‌కు 50 లక్షల రూపాయలు చొప్పున కాంట్రాక్టు ఫీజులు చెల్లిస్తారు. ఈ భారీ మార్పు వెనుక కారణం లేకపోలేదు. టెస్టుల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లందరికీ తలా 15 లక్షల చొప్పున ఇస్తుంటే, ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ వేలంలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. చటేశ్వర్ పుజారా, ఇశాంత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. మరోవైపు తంగరసు నటరాజ్‌కు మూడు కోట్లు, మహమ్మద్ సిరాజ్‌కు ఎవరూ ఊహించని విధంగా 2.6 కోట్ల రూపాయలు దక్కడం సంచలనం సృష్టించింది. టెస్టు స్పెషలిస్టు ఆటగాళ్లుగా ముద్రపడిన వీరి పట్ల ఫ్రాంచైజీలు ఆసక్తిని చూపకపోవడం చర్చనీయాంశమైంది. ఐపిఎల్‌లో లభిస్తున్న మొత్తాలను దృష్టిలో ఉంచుకొని, కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లకు బిసిసిఐ ఫీజును భారీగానే పెంచింది.