క్రీడాభూమి

విమర్శలు సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియా కక్ష కట్టినట్టు వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఈ జాబితాలో బిసిసిఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా చేరాడు. కోహ్లీ పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులు, అక్కడి మీడియా అనుసరిస్తున్న వైఖరి సిగ్గుచేటని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే టీమిండియా మొత్తం కోహ్లీకి మద్దతు ప్రకటించింది. పలువురు మాజీ క్రికెటర్లు, అధికారులు కూడా అతని వెంటే ఉన్నామని స్పష్టం చేశారు. బిసిసిఐ సైతం కోహ్లీకు అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదించి, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి ఫిర్యాదు కూడా చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ డిఆర్‌ఎస్‌ను కోరేందుకు డ్రెస్సింగ్ రూమ్ వద్ద ఉన్న సహచరులు, సపోర్టింగ్ స్ట్ఫా అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నించడాన్ని బిసిసిఐ తప్పుపట్టింది. స్మిత్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని కోహ్లీ చేసిన విమర్శలకు సానుకూలంగా స్పందించింది. స్మిత్‌పై కఠిన చర్య తీసుకోవాలని ఐసిసిని కోరింది. అయితే, సిఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ నివారణ చర్యలు చేపట్టి, బిసిసిఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రీతో చర్చలు జరిపాడు. ఇద్దరి మధ్య రాజీ కుదరడంతో, లిఖితపూర్వక ఫిర్యాదును బిసిసిఐ వాపసు తీసుకుంది. రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సయోధ్య కుదిరినప్పటికీ, మైదానంలో ఇరు జట్ల క్రికెటర్లు మాటామాటా అనుకుంటునే ఉన్నారు. క్రికెట్ మ్యాచ్‌ల్లో ఇలాంటివి సహజమని సరిపుచ్చుకున్నా, ఆస్ట్రేలియా మీడియా మాత్రం కోహ్లీపై నిప్పులు చెరుగుతునే ఉంది. కొంత మంది సిఎ అధికారులు తరచు ఇంటర్వ్యూలిస్తూ, టీమిండియాను విమర్శించడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. మొత్తం మీద సిఎ అధికారులు, అక్కడి మీడియా తీరుపై భారత్‌లో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కోహ్లీని లక్ష్యంగా చేసుకొని ఆసీస్ వ్యవహరించడం సిగ్గుచేటని, క్రీడాస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఠాకూర్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. కోహ్లీపై రోజుకో కథనంతో కొత్తకొత్త విమర్శలు గుప్పిస్తూ, అతని ప్రతిష్ఠను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నదంటూ ఆసీస్ మీడియాపై ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థులను హేళన చేస్తూ, అవమానకరమైన మాటలతో మానసికంగా హింసించే స్లెడ్జింగ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లను మించిన వారు లేరు. కానీ, ఇప్పుడు కోహ్లీ దూకుడు ముందు ఆసీస్ ఆటగాళ్లు వెలవెలపోతున్నారు. మాటకు మాట అప్పచెప్పడంలో కోహ్లీని మించిన వారు లేరన్నది వాస్తవం. అతని మార్గదర్శకంలో టీమిండియా ఆటగాళ్లు కూడా ఎదురుదాడికి దిగేందుకు ఏమాత్రం జంకడం లేదు. ఆస్ట్రేలియా క్రికెటర్లను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నడూలేని ఈ పరిస్థితిని ఆస్ట్రేలియా మీడియా జీర్ణించుకోలేకపోతున్నది. కోహ్లీని నియంత్రిస్తే తప్ప టీమిండియాపై ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం ఉందని అర్థంకావడంతో, ఇప్పుడు దృష్టిని అతనిపైనే కేంద్రీకరించింది. కోహ్లీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఆసీస్ మీడియా ప్రయత్నిస్తుంటే, భారత క్రికెటర్లు, అధికారులు, అభిమానులు అతనికి అండగా నిలుస్తున్నారు. ఇలాంటి చవకబారు వ్యూహానాలను మానుకోవాలని ఠాకూర్ వ్యాఖ్యానించాడు.

చిత్రం..అనురాగ్ ఠాకూర్