క్రీడాభూమి

క్షణక్షణానికీ పెరుగుతున్న ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, మార్చి 23: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిదైన నాలుగో టెస్టు సమీపిస్తున్నకొద్దీ, అందరిలోనూ క్షణక్షణానికీ ఉత్కంఠ పెరుగుతున్నది. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు మాటల ఈటెలు విసురుకుంటున్నారు. వాగ్వాదాలకు దిగుతున్నారు. మైదానంలో యుద్ధపూరిత వాతావరణానికి కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో, శనివారం నుంచి మొదలయ్యే చివరి టెస్టులో ఆటగాళ్లు ఏ విధంగా ప్రవర్తిస్తారన్న ఆందోళన అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకరికొకరు ఏమాత్రం తీసిపోకుండా, ప్రతి అవకాశాన్నీ తమకు అనుకూలంగా మార్చుకుంటున్న రెండు జట్ల క్రికెటర్లు కయ్యానికి కాలుదువుతున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి బిసిసిఐసహా అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుండగా, ఆస్ట్రేలియా క్రికెటర్లకు అక్కడి మీడియా వంతపాడుతున్నది. కోహ్లీపై పదేపదే విమర్శలు చేస్తూ, భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది. ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో తెలియదంటూ, కోహ్లీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలుస్తూ, ఇష్టానుసారంగా ఆరోపణలు గుప్పిస్తున్నది. ఈ పరిస్థితుల్లో, సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి టెస్టులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న భయం వ్యక్తమవుతున్నది.
భారత్ హోదా పదిలం
చివరి టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా, ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని భారత్ నిలబెట్టుకోనుంది. ఈ హోదా కింద భారత్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నుంచి మిలియన్ డాలర్లు లభిస్తాయి. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంటుంది.

చిత్రం..భుజం గాయానికి బ్యాండేజీ వేసుకొని వామప్ రొటీన్‌కు హాజరైన భారత క్రికెట్ జట్టు
కెప్టెన్ విరాట్ కోహ్లీ, గాయం తీవ్రతను పరిశీలిస్తున్న ఫిజియోథెరపిస్టు పాట్రిక్ ఫర్హత్