క్రీడాభూమి

హెచ్‌పిసిఎకు నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: ధర్మశాలలో జరిగే నాలుగో టెస్టుతోపాటు, ఐపిఎల్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం కూడా నిధులు ఇవ్వాలని బిసిసిఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. భారీ మొత్తాల్లో నిధులు ఉన్నప్పటికీ కొన్ని సభ్య సంఘాలు వివిధ మ్యాచ్‌లను నిర్వహించేందుకు నిధులు కోరుతున్నాయని ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో పాలనాధికారుల కమిటీ (సిఒఎ) పేర్కొన్న విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం నుంచి ప్రారంభమయ్యే చివరి, నాలుగో టెస్టు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగాలంటే, ఖర్చులకు డబ్బులివ్వాలంటూ హెచ్‌పిసిఎ దరఖాస్తు చేసుకుందని, అయితే, ఆ సంఘం ఖాతాలో 65 కోట్ల రూపాయలకుపైగా మిగులు నిధులు ఉన్నాయని వివరించి, డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే, సిఒఎ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో హెచ్‌పిసిఎ పిటిషన్ దాఖలు చేసింది. మ్యాచ్‌ల కోసం నిధులు ఇప్పించాల్సిందిగా కోరింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు హెచ్‌పిసిఎకు అనుకూలంగా స్పందించింది. వెంటనే 2.5 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిందిగా బిసిసిఐని ఆదేశించింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ మొత్తాన్ని ఇవ్వక తప్పదని స్పష్టం చేసింది.