క్రీడాభూమి

దలైలామా ఆశీర్వాదంతో ప్రశాంతంగా నిద్రపోతా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, మార్చి 24: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆశీర్వాదంతో తాను ప్రశాంతంగా నిద్రపోతానని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ వ్యాఖ్యానించాడు. శుక్రవారం ఉదయం అతను తన సహచరులతో కలిసి దలైలామాను కలిశాడు. ఆయన నుంచి ఆశీర్వాదం పొందాడు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టెస్టు శనివారం నుంచి ఆరంభం కానున్నప్పటికీ, దలైలామా ఆశీర్వాద కారణంగా ఒత్తిళ్లు లేకుండా నిద్రపోగలుగుతానని అతను విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, కోహ్లీ తుది జట్టులో ఉంటాడా లేదా అన్నది తమకు ముఖ్యం కాదని స్పష్టం చేశాడు. కోహ్లీ కంటే అజింక్య రహానే నుంచే ప్రమాదం ఉందని అనుకుంటున్నట్టు చెప్పాడు.

చిత్రం..ధర్మశాలలో శుక్రవారం టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలిసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ తదితరులు