క్రీడాభూమి

కోహ్లీ డౌటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ మాదిరిగానే ధర్మశాల కూడా ఒక టెస్టుకు మొట్టమొదటిసారి ఆతిథ్యమిస్తోంది. సహజంగా వనే్డ, లేదా టి-20 ఫార్మాట్స్‌లో మొదటి సెషన్‌కు, రెండో సెషన్‌కు తేడా ఉంటుంది. పిచ్ తీరు మారిపోతుంది. ఇక టెస్టుల గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఐదు రోజుల ఆటలో ఏ సమయంలో ఎవరికి సహకరిస్తుందో ఊహించడం కష్టం. ఈ వేదికపై ఆడుతున్న తొలి టెస్టు ఇదే కావడంతో, పిచ్ తీరుతెన్నులపై ఇరు జట్లు అంచనా వేయలేకపోతున్నాయి. అయితే, ఇతర ఫార్మాట్స్‌లో ఇక్కడ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న భారత క్రికెటర్ల పరిస్థితి మెరుగ్గా కనిపిస్తున్నది. కానీ, ఇది ఐదు రోజుల టెస్టు కాబట్టి, పిచ్ తీరును ముందుగా అంచనా వేయడం కష్టమని నిపుణుల అభిప్రాయం. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోతే కష్టాలు తప్పవు.
**
ధర్మశాల, మార్చి 24: ఆస్ట్రేలియాతో శనివారం నుంచి ఇక్కడి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పిసిఎ) మైదానంలో ప్రారంభమయ్యే చివరి, నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడడం అనుమానంగానే కనిపిస్తున్నది. మైదానంలోనేగాక, వెలుపల కూడా పర్సపర ఆరోపణలు, వాగ్వాదాలతో హోరెత్తిస్తున్న భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో చెరొక విజయంతో సమవుజ్జీగా నిలిచాయి. రాంచీ టెస్టు డ్రాగా ముగిసింది. కాగా, చివరి టెస్టులో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కుతుంది. ఒకవేళ మ్యాచ్‌లో ఫలితం తేలకపోతే, సిరీస్ డ్రా అవుతుంది. టీమిండియాను భారత్‌లో ఓడించి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్న ఆసీస్‌కు సిరీస్‌ను డ్రా చేసుకున్నా వచ్చే నష్టమేమీ ఉండదు. ఒకవేళ ఓడినా, భారత్‌ను సొంత గడ్డపై నిలువరించడం కష్టమన్న వాదన వినిపించి తప్పించుకోవచ్చు. మొత్తం మీద ఆ జట్టు ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతుండగా, భారత్ పరిస్థితి మరోలా ఉంది. భుజం గాయంతో బాధపడుతున్న కోహ్లీ ఇంకా పూర్తి ఫిట్నెస్‌ను సంపాదించుకోలేదు. దీనితో అతను చివరి టెస్టులో మైదానంలోకి దిగే అవకాశాలు లేవని అంటున్నారు. ప్రత్యర్థి ఆటగాళ్లను హేళన చేసి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రక్రియ ‘స్లెడ్జింగ్’లో నిష్ణాతులైన ఆసీస్ క్రికెటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే, మాటకు మాట అప్పచెప్పే కోహ్లీ మైదానంలో ఉండితీరాలి. అతను లేకపోతే, మిగతా ఆటగాళ్లు అదే స్థాయిలో దూకుడుగా ఉండడం కష్టమే. తుది జట్టులో కోహ్లీ చేరిక అనుమానంగా కనిపిస్తుండగా, పిచ్ తీరు ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన కూడా టీమిండియాను వేధిస్తున్నది. ధర్మశాల పిచ్‌పై ఉన్న పచ్చిక సీమర్లకు అనుకూలించడం ఖాయం. స్పిన్నర్ల బలంతో నెగ్గుకొస్తున్న భారత్‌కు పేసర్లు విజయాలను అందించిన సంఘటనలు చాలా అరుదు. దీనికితోడు, చివరి టెస్టులో బరిలోకి దిగుతాడనుకున్న మహమ్మద్ షమీ గాయం నుంచి ఇంకా కోలుకున్నాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. దీనితో జట్టు కుదికూర్పు విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. రాంచీ టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు భుజానికి తగిలిన గాయం వేధిస్తుండగా, బ్యాండేజీ వేసుకొని కోహ్లీ శుక్రవారం నెట్స్‌కు హాజరయ్యాడు. అయితే, అతను మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఫిజియో పాట్రిక్ ఫర్హత్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం. శనివారం ఉదయం పరిస్థితి సమీక్షించుకున్న తర్వాతే, కోహ్లీ ఆడే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు.
పరుగుల వరద!
పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. టెస్టుల్లోనూ హెపిసిఎ మైదానం అదే రీతిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. పిచ్‌పై ఉన్న పచ్చికను గమనిస్తే, బంతి ఎక్కువగా బౌన్స్ అవుతుందని స్పష్టమవుతున్నది. అదే నిజమైతే, టెస్టులోనూ పరుగుల వరద పారడం ఖాయం. ఈ సిరీస్‌లో అంతగా రాణించలేకపోతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ధర్మశాల పిచ్ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. గత మూడు టెస్టుల్లో అతను ఆరు ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 131 పరుగులు చేశాడు. భారీగా పరుగులు కొల్లగొట్టే సత్తావున్న వార్నర్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడం ఆసీస్‌ను వేధిస్తున్న సమస్యల్లో ఒకటి. ధర్మశాలలో అతను మళ్లీ ఫామ్‌లోకి వస్తే, ఆసీస్ పరిస్థితి మెరుగుపడుతుంది. అభిమానులకు గొప్ప బ్యాటింగ్‌ను తిలకించే అవకాశం లభిస్తుంది. కోహ్లీని మినహాయిస్తే, భారత జట్టులో ఆ స్థాయి స్ట్రోక్ ప్లేయర్లు లేరన్నది వాస్తవం. అతను మ్యాచ్ ఆడకపోతే, లోకేష్ రాహుల్మురళీ విజయ్, అజింక్య రహానే తదితర టాప్ ఆర్డర్ నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్‌ను ఆశించలేం.

ఫీల్డింగ్ చేస్తే
తిరగబెడుతుందేమో!

ఫీల్డింగ్ చేస్తే, తన భుజం గాయం మళ్లీ తిరగబెడుతుందేమోనని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుమానం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి, నాలుగో టెస్టు శనివారం నుంచి హెచ్‌పిసిఎ మైదానంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం అతను నెట్స్‌కు హాజరయ్యాడు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, ఫీల్డింగ్‌కు దిగేందుకు నూటికి నూరు శాతం ఫిట్నెస్‌తో ఉండడం అవసరమని వ్యాఖ్యానించాడు. తన ఫిట్నెస్‌పై స్పష్టత ఇవ్వని అతను, నాలుగో టెస్టులో తాను ఆడే విషయంపైనా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయం తిరగబెట్టవచ్చని అన్నాడు. బ్యాటింగ్ వరకూ ఫరవాలేదని, కానీ ఫీల్డింగ్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా పూర్తి స్థాయి ఫిట్నెస్ ఉండాలని వ్యాఖ్యానించాడు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ, తనకు ప్రతి మ్యాచ్ ఎంతో కీలకమేనని అన్నాడు.
తాను చేసిన ఏ వ్యాఖ్యలపైనా విచారం వ్యక్తం చేయబోనని కోహ్లీ స్పష్టం చేశాడు. తాను ఎప్పుడూ పొరపాటుగా మాట్లాడనని, ఉన్న వాస్తవాలనే చెప్పాను కాబట్టి ఎవరినీ క్షమాపణ కోరే అవసరం తనకు లేదన్నాడు.

**

చిత్రం..ధర్మశాలలో శుక్రవారం వాపమ్ చేస్తున్న భారత క్రికెటర్లు