క్రీడాభూమి

సత్తా చాటిన షాదబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిడ్జ్‌టౌన్, మార్చి 27: కరీబియన్ దీవుల్లో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో పాకిస్తాన్ బోణీ చేసింది. బ్రిడ్జ్‌టౌన్‌లోని కింగ్‌స్టన్ ఓవల్ మైదానంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో పాక్ 6 వికెట్ల తేడాతో ఆతిథ్య వెస్టిండీస్ జట్టును మట్టికరిపించి తొలి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లోనే చక్కగా రాణించి 7 పరుగులకే 3 వికెట్లతో సత్తా చాటుకున్న పాక్ యువ బౌలర్ షాదబ్ ఖాన్ తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్‌ఫ్రాజ్ అహ్మద్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో విండీస్ ఓపెనర్ ఎవిన్ లూరుూస్ (10), ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ మర్లాన్ శామ్యూల్స్ (7) స్వల్పస్కోర్లకే నిష్క్రమించగా, ఆ తర్వాత నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ చాడ్విక్ వాల్టన్ (18)తో పాటు లెండిల్ సిమ్మన్స్ (1), సునీల్ నారాయణ్ (1), కీరన్ పొలార్డ్ (14), రోవ్‌మన్ పావెల్ (5) కూడా వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టారు. అయితే ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 24 బంతుల్లో 34 పరుగులు సాధించి అజేయంగా నిలువగా, జాసన్ హోల్డర్ 12 బంతుల్లో 14 పరుగులు సాధించి సొహైల్ తన్వీర్ బౌలింగ్‌లో మొహమ్మద్ హఫీజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు రాబట్టగిలిగింది.
అనంతరం 112 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ 13 పరుగులకే నిష్క్రమించగా, ఓపెనర్ కమ్రాన్ అక్మల్ 22 పరుగులు, మొహమ్మద్ హఫీజ్ 5 పరుగులు, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ 29 పరుగులు సాధించి వెనుదిరిగారు. దీంతో పాకిస్తాన్ జట్టు 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 95 పరుగులు సాధించింది. ఆ తర్వాత విండీస్ బౌలర్లను దీటుగా ప్రతిఘటించిన షోయబ్ మాలిక్ (29 బంతుల్లో 38 పరుగులు), సర్‌ఫ్రాజ్ అహ్మద్ (3 బంతుల్లో 4 పరుగులు) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేయడంతో 17.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు సాధించిన పాకిస్తాన్ జట్టు మరో 17 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.

చిత్రం.. షాదబ్‌ను అభినందిస్తున్న పాక్ కెప్టెన్