క్రీడాభూమి

ఆటగాళ్లకు బిసిసిఐ నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో మట్టికరిపించిన టీమిండియా సభ్యులకు 50 లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతులను అందజేయనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) మంగళవారం ప్రకటించింది. అలాగే ఐసిసి టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియాకు బోర్డు అభినందనలు తెలిపింది. భారత జట్టు సభ్యులకు బిసిసిఐ ప్రకటించిన నగదు పురస్కారాలను దామాషా పద్ధతిలో అందజేయనున్నారు. అంటే వారికి ఇచ్చే నగదు మొత్తం ఎంతన్నదీ ఈ సిరీస్‌లో వారు ఆడిన మ్యాచ్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. కనుక ఆస్ట్రేలియాతో మొత్తం నాలుగు మ్యాచ్‌లలోనూ ఆడిన ఆటగాళ్లకు మాత్రమే 50 లక్షల రూపాయల చొప్పున లభిస్తాయి. అలాగే టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేకి రూ.25 లక్షలు, సపోర్టింగ్ స్ట్ఫాలోని ఇతర సభ్యులకు రూ.15 లక్షల చొప్పున అందజేయనున్నట్లు బిసిసిఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.