క్రీడాభూమి

ఇకపై మార్చి 30న ‘క్షమాపణల దినం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్ల మధ్య నడుస్తున్న వాగ్వాదాలు, దూషణలు, క్షమాపణలకు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. మార్చి 30వ తేదీని క్షమాపణల దినంగా ప్రకటించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీపై విమర్శలు చేసిన ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ బ్రాడ్ హాడ్జ్ ఆతర్వాత క్షమాపణలు కోరడంపై అశ్విన్ తీవ్రంగా స్పందించాడు. ఆసీస్‌తో ధర్మశాలలో జరిగిన చివరి, నాలుగో టెస్టు అత్యంత కీలకమైనదని తెలిసినప్పటికీ, భుజం గాయం పేరుతో కోహ్లీ దాని నుంచి వైదొలిగాడని అంతకు ముందు హాడ్జ్ ఒక ఇంటర్వ్యూలో విమర్శించాడు. ఆ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తుందనే భయంతోనే కోహ్లీ ధర్మశాలలో మైదానంలోకి దిగలేదని వ్యాఖ్యానించాడు. ఒక నాయకుడు ఈ విధంగా పలాయన వాదాన్ని పఠించడం ఎంత వరకు సబబని ప్రశ్నించాడు. ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీ అక్కడ కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తాడా అని నిలదీశాడు. కాగా, ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో నాలిక కరచుకున్న హాడ్జ్ బహిరంగ క్షమాపణ కోరాడు. తాను పొరపాటుగా మాట్లాడానని, కోహ్లీని గురించి అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండేదని అన్నాడు. కాగా, హాడ్జ్ క్షమాపణపై అశ్విన్ స్పందిస్తూ, మార్చి 30న చాలా మంది క్షమాపణలు చెప్పారని, కాబట్టి ఇకపై ఈ తేదీని అంతర్జాతీయ క్షమాపణల దినోత్సవంగా ప్రకటించాలని ఎద్దేవా చేశాడు.

చిత్రం..రవిచంద్రన్ అశ్విన్