క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీని రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 3: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, దానిని రద్దు చేయాలని భారత మాజీ క్రికెటర్ రవి శాస్ర్తీ సూచించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలో వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో ప్రపంచ కప్ చాంపియన్‌షిప్స్ జరుగుతున్నప్పుడు చాంపియన్స్ ట్రోఫీ అవసరం ఏమిటని ప్రశ్నించాడు. ఐసిసి ఆధ్వర్యంలో ఎన్ని ప్రపంచ కప్ లేదా చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతాయని చాలా మంది తనను ప్రశ్నించినట్టు సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రవి శాస్ర్తీ చెప్పాడు. ఐదేళ్ల కాలంలో వివిధ ద్వైపాక్షిక వనే్డ లేదా టి-20 సిరీస్‌ల కంటే ఐసిసి ఆధ్వర్యంలో జరిగే టోర్నీలే ఎక్కువగా ఉంటున్నాయని వ్యాఖ్యానించాడు. చాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నీల వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని, క్రికెట్ మ్యాచ్‌లకు అభిమానులు దూరమయ్యే ప్రమాదం ఎదురవుతుందని హెచ్చరించాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, భారత క్రికెటర్ల పారితోషికాన్ని రెండింతలు చేయడంలో ఎలాంటి తప్పులేదని స్పష్టం చేశాడు. ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు చెప్పాడు.