క్రీడాభూమి

అమీర్‌కు చోటు.. షెహజాద్, గుల్‌పై వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ: కళంకిత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్‌ను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో కలగలిపేందుకు నానా తంటాలు పడుతున్న పాకిస్తాన్ సెలెక్టర్లు అతడికి త్వరలో జరుగనున్న ఆసియా కప్, ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్లలో తలపడే తమ జట్టులో చోటు కల్పించారు. అయితే అనుభవజ్ఞుడైన ఓపెనర్ అహ్మద్ షెహజాద్‌తో పాటు సీనియర్ బౌలర్ ఉమర్ గుల్‌కు ఈ జట్టులో స్థానమివ్వకుండా పాక్ సెలెక్టర్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా 2010లో జరిగిన స్పాట్-్ఫక్సింగ్ కుంభకోణంలో దోషిగా తేలి ఐదేళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన అమీర్ (23) ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన సిరీస్ ద్వారా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించిన విషయం తెలిసిందే. రెండు అంతర్జాతీయ వనే్డలు, మరో మూడు ట్వంటీ-20 మ్యాచ్‌లతో కూడిన ఈ సిరీస్‌లో అమీర్ 5 వికెట్లు సాధించడంతో అతడికి పాక్ సెలెక్టర్లు ఆసియా కప్, ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నీల్లో తలపడే జట్టులో మరోసారి చోటు కల్పించారు. అలాగే పాక్ తరఫున ఇప్పటివరకూ ఒక్క అంతర్జాతీయ టి-20 మ్యాచ్‌లో కూడా ఆడని టెస్టు ఓపెనర్ ఖుర్రం మంజూర్‌తో పాటు అన్‌క్యాప్డ్ ఎడమచేతి వాటం పేసర్ రుమ్మన్ రరుూస్‌ను కూడా ఈ జట్టులోకి తీసుకున్నారు. అయితే అహ్మద్ షెహజాద్, ఉమర్ గుల్‌తో పాటు బ్యాట్స్‌మన్లు షోయబ్ మక్సూద్, ముహమ్మద్ రిజ్వాన్‌లకు కూడా ఆసియా కప్, ప్రపంచ కప్ టి-20 టోర్నీల్లో పాల్గొనే జట్టులో చోటు లభించలేదు. వాస్తవానికి ఈ జట్టు ఎంపిక మూడు రోజులు ఆలస్యంగా జరిగిందని, షెహజాద్‌ను పక్కన పెట్టడం, అలాగే వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ కమ్రాన్ అక్మల్‌ను ఎంపిక చేయాలా? వద్దా? అనే విషయమై సెలెక్టర్లు తర్జన భర్జన పడటమే ఇందుకు కారణమని పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) వర్గాలు తెలిపాయి. పాక్ జట్టు ఇదీ: షహీద్ అఫ్రిదీ (కెప్టెన్), ఖుర్రం మంజూర్, మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్, సర్‌ఫ్రాజ్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఇఫ్తికార్ అహ్మద్, ఎమద్ వాసిం, అన్వర్ అలీ, మహమ్మద్ ఇర్ఫాన్, వహాబ్ రియాజ్, మహమ్మద్ అమీర్, మహమ్మద్ నవాజ్, రుమ్మన్ రరుూస్.

‘బుల్స్’కు యు ముంబా షాక్

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ (పికెఎల్)లో యు ముంబా ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. బుధవారం కోల్‌కతాలో జరిగిన పోరులో ఆ జట్టు 1 పాయింట్ తేడాతో బెంగళూరు బుల్స్‌కు షాకిచ్చింది. మ్యాచ్ ఆరంభం నుంచి దాదాపు 38 నిమిషాల పాటు ఎంతో వెనుకబడిన యు ముంబా ఆ తర్వాత పుంజుకుని 29-28 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. అనూప్ కుమార్‌తో పాటు డిఫెన్స్‌లో కీలక ఆటగాళ్లయిన మొహిత్ చిల్లర్, సురేంద్ర నడా, విశాల్ మానే ఈ మ్యాచ్‌లో యు ముంబాకు దూరమైనప్పటికీ సీనియర్ ఆటగాడు రాకేష్ కుమార్ ఎంతో చాకచక్యంతో ఆ జట్టును విజయపథంలో నడిపాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన యు ముంబాకు ఇది మూడో విజయం కాగా, ఆరు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు బుల్స్‌కు ఇది నాలుగో ఓటమి. దీంతో యు ముంబా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా, బెంగళూరు బుల్స్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.