క్రీడాభూమి

భారత్‌లో ఆడేందుకు భయపడనక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనే విషయమై ఏ దేశమూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఉద్ఘాటించారు. భారత్‌లో తమ జట్టుకు భద్రతాపరమైన ముప్పు ఉందని, కనుక త్వరలో జరిగే ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో తమ జట్టుకు సంబంధించిన మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి ప్రతిపాదించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ బుధవారం పై విషయాన్ని స్పష్టం చేశారు. ‘ప్రపంచ కప్ టి-20 టోర్నీలో పాల్గొనే అన్ని జట్లకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించి ఈ టోర్నీని సాధ్యమైనంత అద్భుతంగా నిర్వహిస్తాం. గతంలో కూడా మేము ఎన్నో ప్రపంచ కప్ టోర్నీలకు, అంతర్జాతీయ మ్యాచ్‌లకు చక్కగా ఆతిథ్యమిచ్చాం. కనుక భారత్‌లో ఆడేందుకు ఏ జట్టు భయపడుతున్నట్లు నేను భావించడం లేదు’ అని అనురాగ్ ఠాకూర్ బుధవారం న్యూఢిల్లీలో విలేఖర్లతో అన్నారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు భారత్‌లో జరిగే ప్రపంచ కప్ టి-20 టోర్నీలో పాల్గొనాలా? లేదా? అనే విషయాన్ని నిర్ణయించుకోవాల్సింది పాకిస్తానేనని ఆయన తేల్చిచెప్పారు. ‘ద్వైపాక్షిక సిరీస్ ఎంతో భిన్నమైనది. కానీ ప్రపంచ కప్ టోర్నీల్లో ఎన్నో దేశాల జట్లు పాల్గొంటాయి. ఈసారి టి-20 ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే 16 జట్లలో పాక్ జట్టు ఒకటి. పాక్ జట్టుతో పాటు ఈ టోర్నీకి విచ్చేసే అన్ని జట్లకు భారత ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుంది. కనుక అర్హత సాధించిన జట్లన్నీ భారత్‌కు వచ్చి ఈ టోర్నీలో పాల్గొంటాయని నేను భావిస్తున్నా. ఈ టోర్నీని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఈ విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాటిపై వారే నిర్ణయం తీసుకోవాలి’ అని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
భారత్‌లో పర్యటించేందుకు పాక్ ప్రభుత్వం తమకు అనుమతి ఇవ్వకపోతే టి-20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి తమ జట్టు వైదొలుగుతుందని పిసిబి ఇంతకుముందు సూచనప్రాయంగా తెలిపింది. అయితే భారత్‌లో పర్యటించేందుకు పాక్ ప్రభుత్వం తమకు అనుమతి ఇవ్వకపోతే టి-20 ప్రపంచ కప్ టోర్నీలో పాక్‌కు సంబంధించిన మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని ఐసిసికి ప్రతిపాదించినట్లు పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ వెల్లడించారు.