క్రీడాభూమి

రేసులో సింధు, గార్గ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) అథ్లెట్ల కమిషన్‌లో చోటు కోసం అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న తెలుగు తేజం, ఒలింపిక్ రజత పతక విజేత పివి.సింధు సహా మొత్తం తొమ్మిది పోటీపడుతున్నారు. నాలుగు స్థానాల కోసం జరిగే ఈ ఎన్నికల్లో సింధుతో పాటు భారత్ నుంచి అంతగా పరిచయం లేని పురుష షట్లర్ నిఖర్ గార్గ్ కూడా రేసులో నిలవడం గమనార్హం. ఆటగాడిగా కంటే క్రీడా సంస్థలపై విమర్శలతో ఎక్కువగా పేరు పొందిన గార్గ్ జనవరి నాటికి ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 374వ స్థానంలో ఉన్నాడు. బిడబ్ల్యుఎఫ్ అథ్లెట్ల కమిషన్‌లో స్థానం కోసం పోటీ చేయాలన్న కాంక్షను వ్యక్తం చేయడంతో అతనికి ఈ నామినేషన్ లభించినట్లు తెలుస్తోంది. స్వతంత్ర క్రీడాకారులకు మరింత స్వయం ప్రతిపత్తిని కల్పించాలని, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనే స్వతంత్ర క్రీడాకారులు తమ క్రీడా సంఘాల ద్వారా కాకుండా నేరుగా పేర్లు నమోదు చేసుకునేందుకు అనుమతించాలని బిడబ్ల్యుఎఫ్‌ను కోరుతూ గార్గ్ 2016 మే నెలలో ఆన్‌లైన్ పిటిషన్ దాఖలు చేశాడు.
బిడబ్ల్యుఎఫ్ అథ్లెట్ల కమిషన్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు గత నెల 27వ తేదీతో ముగిసింది. అప్పటికి ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అథ్లెట్ల కమిషన్‌లో నాలుగేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మే నెలలో నుంచి బయటికి వెళ్తున్న యుహన్ టాన్ (బెల్జియం), హన్స్ క్రిస్టియన్ సోల్బెర్గ్ విట్టింగస్ (డెన్మార్క్), గ్రేసియా పోలీ (ఇండోనేసియా) స్థానాలను భర్తీ చేసేందుకు తొలిసారి ఇ-మెయిలింగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు ఈ నెల 26వ తేదీన ప్రారంభమై మే 24వ తేదీన ముగుస్తాయి. నిబంధనల ప్రకారం ఈ మూడు స్థానాలకు కనీసం ఒక క్రీడాకారుడిని, ఒక క్రీడాకారిణిని తప్పనిసరిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన మూడో స్థానానికి పురుషుడైనా లేక మహిళ అయినా ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తే వారు ఎన్నికవుతారు. అలాగే అథ్లెట్ల కమిషన్ సభ్యత్వ పదవికి రాజీనామా చేసిన చైనా క్రీడాకారిణి తాంగ్ యువాంటింగ్ పదవీ కాలాన్ని పూర్తి చేసేందుకు అదనంగా నాలుగో వ్యక్తిని (మహిళను) ఎన్నుకోనున్నారు. 2015లో అథ్లెట్ల కమిషన్ సభ్యురాలిగా చేరిన తాంగ్ యువాంటింగ్ గత ఏడాది బాడ్మింటన్ నుంచి రిటైర్ అవడంతో అథ్లెట్ల కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేసింది. దీంతో ఆమె పదవీ కాలంలో మిగిలిన రెండేళ్లకు గాను నాలుగో వ్యక్తిని ఎన్నుకోనున్నారు.