క్రీడాభూమి

29 నుంచి అజ్లాన్ షా హాకీ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 11: మలేసియాలోని ఇపోలో ఈ నెల 29వ తేదీ నుంచి జరుగనున్న సుల్తాన్ అజ్లాన్ షా కప్ 26వ ఎడిషన్ హాకీ టోర్నమెంట్‌లో తలపడే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు స్టార్ కస్టోడియన్ పిఆర్.శ్రీజేష్ సారథ్యం వహించనుండగా, మన్‌ప్రీత్ సింగ్ వైస్-కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లతో సమతూకంగా ఉన్న ఈ జట్టులో జూనియర్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో విజయభేరి మోగించి టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు డిఫెండర్ గురీందర్ సింగ్, మిడ్‌ఫీల్డర్లు సుమిత్, మన్‌ప్రీత్ సింగ్‌లతో పాటు గత ఏడాది ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత జూనియర్ జట్టు గోల్‌కీపర్ సురాజ్ కర్కెరాకు తొలిసారి చోటు కల్పించారు. కర్కెరా (21) గత ఏడాది నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్‌తో పాటు రష్యాలో జరిగిన యూరేషియా కప్ టోర్నీలోనూ పాల్గొన్నాడు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ టోర్నీతో పాటు 2020లో జపాన్‌లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గోనే భారత జట్టును ఇప్పటి నుంచే తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించినట్లు ప్రధాన కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్ తెలిపాడు.
ఇదీ భారత జట్టు
గోల్‌కీపర్లు: పిఆర్.శ్రీజేష్ (కెప్టెన్), సురాజ్ కర్కెరా,
డిఫెండర్లు: పర్‌దీప్ మోర్, సురేందర్ కుమార్, రూపీందర్‌పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, గురీందర్ సింగ్,
మిడ్‌ఫీల్డర్లు: చిన్‌గ్లెన్సన సింగ్ కొంగుజమ్, సుమిత్, సర్దార్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ (వైస్-కెప్టెన్), హర్‌జీత్ సింగ్, మన్‌ప్రీత్,
ఫార్వర్డ్ ఆటగాళ్లు: ఎస్‌వి.సునీల్, తల్వీందర్ సింగ్, మన్‌దీప్ సింగ్, అఫ్ఫన్ యూసఫ్, ఆకాష్‌దీప్ సింగ్.