క్రీడాభూమి

శాంసన్.. గర్జించెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఏప్రిల్ 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాడు సంజూ శాంసన్ శతకంతో గర్జించాడు. ఈ టోర్నీలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను మంగళవారం ఇక్కడ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌తో జరిగిన అతను చక్కగా రాణించి 63 బంతుల్లో 102 పరుగులు సాధించాడు. ప్రస్తుత ఐపిఎల్ పదో ఎడిషన్ టోర్నీలో ఇదే తొలి శతకం కాగా, ఐపిఎల్ కెరీర్‌లో శాంసన్‌కు ఇదే తొలి సెంచరీ. ఈ శతకాన్ని ఆసరాగా చేసుకుని నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోరు సాధించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 97 పరుగుల తేడాతో పుణె జట్టును మట్టికరిపించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఈ సీజన్‌లో ఇంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలైన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ఇదే తొలి విజయం.
అంతకుముందు టాస్ గెలిచిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో ఓపెనర్ ఆదిత్య తరే (0) పరుగుల ఖాతా ఆరంభించకుండానే డకౌట్‌గా వెనుదిరగడంతో ఆ జట్టు 2 పరుగుల స్కోరు వద్దే తొలి వికెట్‌ను కోల్పోయింది. అయితే ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ పుణె బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించాడు. నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శామ్ బిల్లింగ్స్ అందించిన సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని స్కోరు బోర్డును పరుగులు తీయించిన శాంసన్ 41 బంతుల్లో అర్థ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. బిల్లింగ్స్ (24)తో కలసి రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించిన శాంసన్ ఆ తర్వాత మరింత విజృంభించాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (31)తో కలసి మూడో వికెట్‌కు మరో 53 పరుగులు జోడించిన శాంసన్ మొత్తం మీద 63 బంతుల్లో ఐదు సిక్సర్లు, మరో నాలుగు ఫోర్ల సహాయంతో 102 పరుగులు సాధించి ఆడమ్ జంపా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో పుణె జట్టు 166 పరుగుల స్కోరు వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత చివర్లో మెరుపులు మెరిపించిన క్రిస్ మోరిస్ కేవలం 9 బంతుల్లోనే 38 పరుగులతో అజేయంగా నిలువగా, కొరి జె.ఆండర్సన్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం 206 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పుణె జట్టుపై డేర్‌డెవిల్స్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకు పడ్డారు. వీరి జోరును ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన పుణె జట్టులో ఓపెనర్ అజింక్యా రహానే 10 పరుగులకు, నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 20 పరుగులకు నిష్క్రమించారు. దీంతో పరుగుల వేటలో దారుణంగా చతికిలబడిన పుణె జట్టు ఆ తర్వాత కూడా విరామం లేకుండా వికెట్లను చేజార్చుకుంది. రాహుల్ త్రిపాఠి (10), ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఫఫ్ డుప్లెసిస్ (8), బెన్ స్టోక్స్ (2), వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ (11), రజత్ భాటియా (16), దీపక్ చహర్ (14), ఆడమ్ జంపా (5), అశోక్ దిండా (7) వరుసగా పెవిలియన్‌కు పరుగెత్తగా, ఇమ్రాన్ తాహిర్ (0) అజేయంగా నిలిచాడు. దీంతో 16.1 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్టు 97 పరుగుల తేడాతో ఘోరంగా చతికిలబడింది.
సంక్షిప్తంగా స్కోర్లు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 205/4 (సంజూ శాంసన్ 102, క్రిస్ మోరిస్ 38, రిషభ్ పంత్ 31, శామ్ బిల్లింగ్స్ 24, ఇమ్రాన్ తాహిర్ 1/24, దీపక్ చహర్ 1/35, ఆడమ్ జంపా 1/45)
వికెట్ల పతనం: 1=2, 2-71, 3-124, 4-166.
పుణె సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: 16.1 ఓవర్లలో 108 ఆలౌట్ (మయాంక్ అగర్వాల్ 20, రజత్ భాటియా 16, దీపక్ చహర్ 14, మహేంద్ర సింగ్ ధోనీ 11, అజింక్యా రహానే 10, రాహుల్ త్రిపాఠి 10, అమిత్ మిశ్రా 3/11, జహీర్ ఖాన్ 3/20, ప్యాట్ కమ్మిన్స్ 2/24, క్రిస్ మోరిస్ 1/19, షాబాజ్ నదీమ్ 1/23)
వికెట్ల పతనం: 1-24, 2-34, 3-49, 4-52, 5-54, 6-79, 7-94, 8-100, 9-107, 10-108.

చిత్రం..సెంచరీ హీరో సంజూ శాంసన్

**
ఐపిఎల్‌లో నేడు
*
ముంబయి
ఇండియన్స్
సన్‌రైజర్స్
హైదరాబాద్

*
ముంబయిలో రాత్రి 8 గంటల నుంచి