క్రీడాభూమి

డార్ట్‌మండ్ జట్టుపై దాడితో జర్మనీలో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డార్ట్‌మండ్, ఏప్రిల్ 12: డార్ట్‌మండ్ ఫుట్‌బాల్ జట్టును లక్ష్యంగా చేసుకొని దాడి జరగడంతో జర్మనీలో హై అలర్ట్ ప్రకటించారు. చాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్ ఫస్ట్‌లెగ్ మ్యాచ్‌లు జరిగే అన్ని ప్రాంతాల్లోనూ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, డార్ట్‌మండ్ జట్టును లక్ష్యంగా చేసుకొని జరిగిన బాంబు దాడిపై జర్మనీ పోలీస్ అధికారులు విచారణ చేపట్టారు. బొరుసియా డార్ట్‌మండ్ జట్టు సభ్యులు తాము బస చేసిన హోటల్ గది నుంచి మోనాకాతో క్వార్టర్ ఫైనల్ ఫస్ట్‌లెగ్ మ్యాచ్‌ని ఆడేందుకు స్టేడియానికి బయలుదేరినప్పుడు పేలుడు సంఘటన చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని మూడు బాంబులను పేల్చారు. ఈ సంఘటనలో స్పెయిన్‌కు చెందిన అంతర్జాతీయ ఆటగాడు మార్క్ బర్‌ట్రా స్వల్పంగా గాయపడ్డాడు. పగిలిన ఒక గాజు ముక్క బలంగా గుచ్చుకోవడంతో అతని చేతికి గాయమైంది. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించిన అధికారులు, చిన్నపాటి శస్త్ర చికిత్స చేయించారు. ఇలావుంటే, సుమారు ఏడాది కాలంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులు జర్మనీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిరుడు వరుస సంఘటనలు జరిగితే, డిసెంబర్‌లో బెర్లిన్‌లోని క్రిస్మస్ మార్కెట్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి 12 మందిని పొట్టనబెట్టుకుంది. కాగా, డార్ట్‌మండ్ సాకర్ జట్టును లక్ష్యంగా చేసుకొని జరిగిన ఉగ్రవాద దాడి యావత్ క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడికి తామే కారణమంటూ ఒక లేఖ సంఘటన స్థలం వద్ద లభించిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీస్ అధికారులు ప్రకటించారు. త్వరలోనే వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.