క్రీడాభూమి

కోలుకున్న కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 13: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రాయల్ చారెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తున్న విరాట్ కోహ్లీ భుజం గాయం నుంచి కోలుకున్నాడు. ముంబయి ఇండియన్స్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో పాల్గొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు కోహ్లీ గాయపడిన విషయం తెలిసిందే. దీని తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతను అత్యంత కీలకమైన నాలుగో టెస్టులో ఆడలేదు. ఇలావుంటే, ముందు జాగ్రత్త చర్యగా ఐపిఎల్‌లో ఆరంభ మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉండడని, రెండో వారంలో ఫిట్నెస్‌పై స్పష్టతనిస్తామని బిసిసిఐ ప్రకటించింది. ఇలావుంటే, కోహ్లీ కోలుకున్నాడని, ముంబయితో శుక్రవారం నాటి మ్యాచ్‌లో అతను ఆడవచ్చని బిసిసిఐ మెడికల్ బృందం ప్రకటించింది. నిరుటి రన్నరప్‌గా ఈసారి ఐపిఎల్ బరిలోకి దిగిన బెంగళూరు ఇంత వరకూ మూడు మ్యాచ్‌లు ఆడి, రెండు పరాజయాలను చవిచూసింది. ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న ఈ జట్టుకు కోహ్లీ రాక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం ఖాయం. కాగా, తనకు ఫిట్నెస్ సమస్య లేదని, ఐపిఎల్ మ్యాచ్‌లకు సిద్ధంగా ఉన్నానని కోహ్లీ ఇది వరకే ప్రకటించాడు. అంతేగాక, ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొని, ఫీల్డింగ్ డ్రిల్స్ కూడా చేశాడు. నిరుడు ఐపిఎల్లో అతను 16 మ్యాచ్‌లు ఆడి, నాలుగు సెంచరీల సాయంతో 973 పరుగులు సాధించాడు. అతని ప్రతిభతోనే బెంగళూరు ఫైనల్ చేరింది. కానీ, అనూహ్యంగా సన్‌రైజర్స్ చేతిలో ఓడింది.
బలపడిన బ్యాటింగ్ లైనప్
కోహ్లీ చేరికతో బెంగళూరు బ్యాటింగ్ లైనప్ మరింత బలపడింది. స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో, అతని స్థానంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎబి డివిలియర్స్‌కు అవకాశం ఇచ్చారు. దీనిని సద్వినియోగం చేసుకున్న అతను కింగ్స్ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లోనే 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో బెంగళూరు ఓడినప్పటికీ, గాయం కారణంగా చాలకాలం విశ్రాంతి తీసుకున్న డివిలియర్స్ మళ్లీ మైదానంలోకి దిగి, తన ఫామ్‌ను నిరూపించుకోవడం అభిమానులకు ఊరటనిచ్చింది. ముంబయితో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో అతను మరోసారి సత్తా చాటే అవకాశం ఉంది. కోహ్లీ కూడా జత కలిస్తే, ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం లేదా తన ముందు ఉన్న ఎలాంటి లక్ష్యాన్నయినా ఛేదించడం బెంగళూరుకు కష్టం కాదు.
ఈ మ్యాచ్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది.