క్రీడాభూమి

శ్రీకాంత్‌పై ప్రణీత్ విజయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక బాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో ఇద్దరు భారతీయులు పురుషుల సింగిల్స్ ఫైనల్స్ చేరడం ఇదే మొదటిసారి. భారత బాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన ప్రణీత్, శ్రీకాంత్ ఇద్దరూ గోపీచంద్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న వారు కావడంతో, దాదాపుగా రోజూ కలిసే ప్రాక్టీస్ చేస్తారు. ఒకరి ఆట గురించి మరొకరికి బాగా తెలుసు. ఒకరి వ్యూహాలపై మరొకరికి స్పష్టత ఉంది. గత రికార్డులను దృష్టిలో ఉంచుకొని, శ్రీకాంత్‌ను ఫేవరిట్‌గా విశే్లషకులు అభివర్ణించారు. కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ ప్రణీత్ విజేతగా నిలిచాడు.
మొదటి సెట్‌ను తన ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్ రెండో సెట్ ఆరంభంలోనూ ఆధిపత్యాన్ని కనబరిచాడు. అయితే, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, ఎదురుదాడిని ఆరంభించిన ప్రణీత్ ఆరు పాయింట్లు సంపాదించి, శ్రీకాంత్‌కు సమవుజ్జీగా నిలిచాడు. ఆతర్వాత ఇద్దరూ హోరాహోరీగా పోరాటం సాగించడంతో స్కోరు 7-7, 8-8గా సాగింది. కానీ, ఆతర్వాత శ్రీకాంత్‌ను వెనక్కునెట్టేసిన ప్రణీత్ రెండో సెట్‌ను సాధించాడు. అదే ఉత్సాహంతో మూడో సెట్‌ను కూడా గెల్చుకున్నాడు.

సింగపూర్, ఏప్రిల్ 16: తెలుగు తేజం సింగపూర్‌లో వెలుగులు చిమ్మింది. గుంటూరు చిన్నోడు సాయి ప్రణీత్ సింగపూర్ ఓపెన్ బాడ్మింటిన్ పురుషుల సింగిల్స్ సాధించి, కెరీర్‌లో మొదటి సూపర్ సిరీస్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో ఓడి, రన్నరప్‌గా నిలిచిన కిడాంబి శ్రీకాంత్ కూడా ప్రణీత్ మాదిరిగానే హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడెమీలో శిక్షణ పొందుతున్నవాడే కావడం విశేషం. ఇద్దరు తెలుగు ఆటగాళ్లు ఫైనల్ చేరుకోవడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది. మొదటి సెట్‌ను శ్రీకాంత్ 21-17 తేడాతో గెల్చుకొని, ఈ టైటిల్ ఫేవరిట్ అనిపించుకున్నాడు. అయితే, ఎదురుదాడికి దిగిన ప్రణీత్ మిగతా రెండు సెట్లను 21-17, 21-12 తేడాతో సొంతం చేసుకొని, ట్రోఫీని అందుకున్నాడు. కాగా, పురుషుల డబుల్స్‌లో మథియాస్ బొయే, కార్‌స్టెన్ మొగెనె్సన్ జోడీ టైటిల్ దక్కించుకుంది. వీరు ఫైనల్‌లో లీ జున్ హుయ్, లియూ యుచెన్ జోడీపై 21-13, 21-14 తేడాతో విజయం సాధించారు.

చిత్రం..కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ బాడ్మింటన్ టైటిల్ సాధించిన సాయ ప్రణీత్