క్రీడాభూమి

రొనాల్డో హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగులకే అవుటయ్యాడు. గత 17 ఐపిఎల్ ఇన్నింగ్స్‌లో అతను సింగిల్ డిజిట్ పరిమితం కావడం ఇదే మొదటిసారి.
* డేవిడ్ వార్నర్ వికెట్ కూలిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేన్ విలియమ్‌సన్‌కు ఇది టి-20 కెరీర్‌లో వందో ఇన్నింగ్స్. రెండో వికెట్‌కు శిఖర్ ధావన్‌తో కలిసి అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఐదు సిక్సర్లు కొట్టాడు. టి-20 మ్యాచ్‌ల్లో ఇన్ని సిక్సర్లు బాదడం అతనికి ఇది రెండోసారి. ఇంతకు ముందు నార్తన్ డిస్ట్రిక్ట్ తరఫున కేప్ కోబ్రాస్‌పై అతను ఐదు సిక్సర్లు సాధించాడు. కాగా, సన్‌రైజర్స్‌కు రెండో వికెట్‌కు యాభైకిపైగా పరుగులు జత కలవడం ఇది మూడోసారి. మిగతా జట్లు ఏవీ రెండో వికెట్‌కు ఇన్ని పర్యాయాలు ఫిఫ్టీ ప్లస్ పార్ట్‌నర్‌షిను సాధించలేదు.
* ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ఇది పదోసారి. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్, కేన్ విలియమ్‌సన్ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌ను అందించారు. ఐపిఎల్‌లో ఏ జట్టూ ఇన్ని సెంచరీ భాగస్వామ్యాలను నమోదు చేయలేదు.

మాడ్రిడ్, ఏప్రిల్ 19: వేలాది మంది అభిమానుల సమక్షంలో, స్వదేశంలో జరిగిన చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్‌లో ప్రత్యర్థి బయెర్న్ మ్యూనిచ్‌ని 4-2 తేడాతో ఓడించిన రియల్ మాడ్రిడ్ సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఇప్పటికే వంద గోల్స్ పూర్తి చేసిన క్రిస్టియానో రొనాల్డో హ్యాట్రిక్ సాధించి, బయెర్న్‌పై రియల్ మాడ్రిడ్‌కు తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టాడు. నిజానికి మ్యాచ్ ఆరంభంలో బయెర్న్ ఆధిపత్యం కొనసాగింది. రియల్ మాడ్రిడ్ రక్షణ వలయాన్ని ఛేదించడానికి ఆ జట్టు ఆటగాళ్లు పదేపదే ప్రయత్నాలు కొనసాగించారు. అయితే, మ్యాచ్ ప్రథమార్ధంలో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ద్వితీయార్ధం మొదలైన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. 53వ నిమిషంలో రాబర్ట్ లెవాండౌస్కీ గోల్ చేసి, బయెర్న్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. దీనితో కంగుతిన్న రియల్ మాడ్రిడ్ ఎదురుదాడికి దిగింది. 76వ నిమిషంలో రొనాల్డో ఈక్వెలైజర్‌ను సాధించగా, మరో నిమిషం తర్వాత బయెర్స్‌కు గోల్ లభించింది. రియల్ మాడ్రిడ్ స్టార్ సెర్గియో రామోస్ ఓన్ గోల్ చేసి, ప్రత్యర్థి జట్టుకు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్ నమోదైన తర్వాత రొనాల్డో విజృంభణ కొనసాగింది. 104 తిరిగి 109 నిమిషాల్లో అతను గోల్స్ సాధించి, రియల్ మాడ్రిడ్‌కు 3-2 ఆధిక్యాన్ని అందించాడు. 112వ నిమిషంలో మార్కో అసెన్సియో సాధించిన గోల్‌తో ఈ జట్టు 4-2 తేడాతో విజయభేరి మోగించింది. కాగా, మరో క్వార్టర్ ఫైనల్‌లో లీసెస్టర్ సిటీపై అట్లెటికో మాడ్రిడ్ 2-1 తేడాతో గెలిచింది. మిగిలిన రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో బార్సిలోనాతో జువెంటాస్, మొనాకోతో బొరష్యా డార్ట్‌మండ్ ఢీ కొంటాయి.