క్రీడాభూమి

కౌశిక్ పటేల్‌కు అమెరికా పౌరసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, ఏప్రిల్ 19: భారత్‌లో జన్మించి, చాలా కాలంగా అమెరికాలో నివాసం ఉంటున్న క్రికెటర్ తిమిల్ కౌశిక్ పటేల్‌కు అక్కడి పౌరసత్వం లభించింది. అమెరికా క్రికెట్ జట్టులో తన స్థానాన్ని పదిలం చేకున్న 33 ఏళ్ల కౌశిక్ పటేల్ అమెరికాలో షార్ట్‌టెర్మ్ రెసిడెంట్‌గానే కొనసాగాడు. ఇన్నాళ్లకు అతనికి పౌరసత్వం లనించింది. సుమారు 100 దేశాలకు చెందిన 3,800 మంది హాజరైన ఒక కార్యక్రమంలో అమెరికా పౌరసత్వం తీసుకుంటున్నట్టు కౌశిక్ పటేల్ ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు అమెరికా పౌరుడిగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించిందని, ఈ రోజు కోసం తాను చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని కౌశిక్ పటేల్ అన్నాడు. భారత జాతీయ జూనియర్ జట్టులో ఆడిన అతను ఆతర్వాత అమెరికా వెళ్లిపోయాడు. అక్కడే క్రికెటర్‌గా ఎదిగి, జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పుడు అమెరికా పౌరసత్వం కూడా అతనికి లభించింది.

కొర్చ్‌నొయ్ చెస్‌లో ఆనంద్‌కు మూడో స్థానం
చెన్నై, ఏప్రిల్ 19: ఇక్కడ జరిగిన కొర్చ్‌నొయ్ జ్యూరిచ్ చెస్ చాలెంజర్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్, ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ మూడో స్థానం దక్కించుకున్నాడు. మొత్తం 21 పాయింట్లకుగాను అతను 13.5 పాయింట్లు సాధించాడు. 2015 జూన్ 6న మృతి చెందిన లెజెండరీ చెస్ ఆటగాడు విక్టర్ కొర్చ్‌నొయ్ స్మారకార్థం నిర్వహించిన ఈ టోర్నమెంట్ టైటిల్‌ను అమెరికాకు చెందిన హిరాకు నాకమూర కైవసం చేసుకున్నాడు. అతను మొత్తం 15 పాయింట్లు సంపాదించగా, 14 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్న రష్యా ఆటగాడు ఇయాన్ నెపొమ్నియాచి రెండో స్థానాన్ని ఆక్రమించాడు.