క్రీడాభూమి

రైనా కెప్టెన్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 21: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శుక్రవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సురేష్ రైనా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో, 188 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ఆరు వికెట్లు కోల్పోయ అందుకుంది.
గుజరాత్ ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ గౌతం గంభీర్‌తో కలిసి ప్రారంభించిన సునీల్ నారైన్ ఆరంభం నుంచే విరుచుకుపడ్డిడు. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన అతను 17 బంతులు ఎదుర్కొని 42 పరుగులు చేశాడు. ఈ స్కోరులో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నారు. 45 పరుగుల స్కోరువద్ద సురేష్ రైనా బౌలింగ్‌లో జేమ్స్ ఫాల్క్‌నెర్ క్యాచ్ పట్టగా నారైన్ అవుట్‌కాగా, ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన వికెట్‌కీపర్ రాబిన్ ఉతప్ప కూడా వేగంగా పరుగులు కొల్లగొట్టాడు. అతనితో కలిసి రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించిన తర్వాత గంభీర్ (33) అవుటయ్యాడు. ధాటిగా ఆడుతూ 48 బంతుల్లో 72 పరుగులు సాధించిన ఉతప్పను బ్రెండన్ మెక్‌కలమ్ క్యాచ్ పట్టగా ప్రవీణ్ కుమార్ అవుట్ చేశాడు. ఉతప్ప స్కోరులో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అతని విజృంభణతో నైట్ రైడర్స్ రన్‌రేట్ మెరుగుపడింది. మనీష్ పాండే 24, సూర్యకుమార్ యాదవ్ ఒక పరుగు చేసి అవుట్‌కాగా, నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసే సమయానికి యూసుఫ్ పఠాన్ (11), షకీబ్ అల్ హసన్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆరోన్ ఫించ్ (31), బ్రెండన్ మెక్‌కలమ్ (33) అండగా నిలిస్తే, మిడిల్ ఆర్డర్‌లో వరుస వికెట్లు కూలడంతో ఒకానొక దశలో గుజరాత్ విజయం కష్టంగా కనిపించింది. కానీ, రైనా 46 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 84 పరు గులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. రవీంద్ర జడేజా (15 నాటౌట్), జేమ్స్ ఫాల్క్‌నెర్ (3 నాటౌట్) మరో వికెట్ కూలకుండా, పది బంతులు మిగిలి ఉండగానే గుజరాత్‌కు విజయాన్ని అందించారు.

చిత్రం..గుజరాత్‌ను గెలిపించిన రైనా