క్రీడాభూమి

వార్నర్, ధావన్‌పై భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఏప్రిల్ 21: కెప్టెన్ డేవిడ్ వార్నర్, చాలాకాలం తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ సత్తాపై భారం వేసి, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌తో శనివారం జరిగే ఐపిఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా టోర్నీని మొదలుపెట్టి, తొలి మ్యాచ్‌లోనే నిరుటి రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును, అనంతరం గుజరాత్ లయన్స్‌ను ఓడించిన సన్‌రైజర్స్ ఆతర్వాత అనూహ్యంగా విఫలమైంది. ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయాలను ఎదుర్కొంది. రెండు వరుస పరాజయాలతో కంగుతిన్న వార్నర్ సేన పొరపాట్లను సరిదిద్దుకుంది. లోటుపాట్లను సవరించుకుంది. ఫలితంగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లను ఓడించి ఫామ్‌ను నిరూపించుకుంది.
కాగా, పరాజయాల బాటలో నడుస్తున్న పుణే జట్టును మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్లాప్ షో తీవ్రంగా వేధిస్తున్నది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ జట్టుకు అండగా నిలుస్తున్నప్పటికీ, మిగతా వారు అనుకున్న రీతిలో రాణించడం లేదు. ఈ జట్టు మొత్తం ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు పరాజయాలను చవిచూసింది. సాధించిన రెండు విజయాల్లో తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై నమోదు చేసింది ఒకటి. అదే ఉత్సాహంతో సన్‌రైజర్స్‌ను ఢీకొనేందుకు స్మిత్ బృందం సిద్ధమవుతున్నది. మొత్తం మీద ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను హాట్ ఫేవరిట్‌గా పేర్కొంటున్నారు.
మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది.

శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ (ఫైల్ ఫొటో)