క్రీడాభూమి

విండీస్ తొలి ఇన్నింగ్స్ 7 వికెట్లకు 244

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, ఏప్రిల్ 22: రోస్టన్ చేస్, షేన్ డౌరిచ్ అర్ధ శతకాలతో రాణించడంతో, పాకిస్తాన్‌తో ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 244 పరుగులు చేసింది. ఓపెనర్ క్రెగ్ బ్రాత్‌వెయిట్ పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్ కావడంతో కంగుతిన్న వెస్టిండీస్ చాలా సేపు కోలుకోలేకపోయింది. షిరోన్ హెట్మెయర్ (11), కీరన్ పావెల్ (33), షాయ్ హోప్ (2), విషాల్ సింగ్ (9) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. అయితే చేస్ (151 బంతుల్లో 63), షేన్ డౌరిచ్ (130 బంతుల్లో 56) జట్టును ఆదుకున్నారు. వారిద్దరూ అవుటైన తర్వాత జట్టును అండగా నిలిచిన కెప్టెన్ జాసన్ హోల్డర్ 30, డేవేంద్ర బిషూ 23 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. పాక్ ఫేసర్ మహమ్మద్ అమీర్ 28 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా, యాసిర్ షా రెండు వికెట్లు కూల్చాడు.