క్రీడాభూమి

అదనంగా మరో 10 కోట్ల డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఆదాయం పంపిణీ విధానంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి)కి, బిసిసిఐకి మధ్య వివాదం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా బిసిసిఐ అధ్యక్షుడి హోదాలో ఐసిసి చైర్మన్ పదవి చేపట్టిన శశాంక్ మనోహర్ తీరుపై బిసిసిఐ భగ్గుమంటోంది. బిసిసిఐ ఆదాయానికి గండి కొట్టేందుకు మనోహర్ పన్నుతున్న ఎత్తులకు బిసిసిఐ సైతం అదే స్థాయిలో పై ఎత్తులు వేస్తోంది. కాగా, తాజాగా ప్రతిపాదించిన ఆదాయ పంపిణ విధానంలో భాగంగా భారత్‌కు ఇవ్వజూపిన దానికన్నా మరో పది కోట్ల డాలర్లను ఇవ్వడానికి శశాంక్ మనోహర్ చేసిన ప్రతిపాదనను బిసిసిఐ తిరస్కరించింది. ‘కొత్త ఆదాయం పంపిణీ విధానంలో భాగంగా అదనంగా మరో వంద మిలియన్ డార్లు ఇవ్వడానికి శశాంక్ మనోహర్ ప్రతిపాదించిన మాట నిజమే. దీనిపై బిసిసిఐ తన వైఖరి తెలియజేయడానికి ఆయన గడువును కూడా నిర్ణయించారు. అయితే మేము దీన్ని ఒక ప్రతిపాదనగా కూడా పరిగణించలేదు. కనుకనే ఎలాంటి సమాదానం కూడా ఇవ్వలేదు’ అని ప్రస్తుతం దుబాయిలో ఉన్న బిసిసిఐ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం పిటిఐకి చెప్పారు. ‘ఈ ప్రతిపాదన మనోహర్‌నుంచి వచ్చింది. ఆయన ఐసిసి చైర్మన్ కావచ్చు కానీ, ఆదాయంలో ఎవరి వాటా ఎంత ఉండాలో నిర్ణయించాల్సింది ఐసిసిలోని సభ్యదేశాలు మాత్రమే. అన్ని దేశాలతో కలిసి కొత్త ఫార్ములాను రూపొందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. బిసిసిఐ వాటా ఎంత ఉండాలో నిర్ణయించాల్సింది మనోహర్ కాదు’ అని ఆ అధికారి చెప్పారు.
భారత్ వాటాను గణనీయంగా తగ్గిస్తున్న ఐసిసి ప్రతిపాదించిన తాజా ఆదాయం పంపిణీ ఫార్ములాపై బిసిసిఐకి, ఐసిసికి మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమలవుతున్న ‘బిగ్-3 రెవిన్యూ షేరింగ్’ విధానం కింద భారత్‌కు ఐసిసినుంచి ఏడాదికి 579 మిలియన్ డాలర్లు లభిస్తున్నాయి. అయితే మనోహర్ చేసిన తాజా ప్రతిపాదనలను గనుక అంగీకరిస్తే ఈ ఆదాయం 279 మిలియన్ డాలర్లకు గణనీయంగా పడిపోతుంది. అందుకే సుప్రీంకోర్టు నియమించిన పాలకుల బృందం సైతం దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఈ అంశంపై బిసిసిఐ వాదన ఏమిటని ప్రశ్నించగా భారత్ వాటా తగ్గకుండా మిగతా సభ్య దేశాల ఆదాయం పెరిగేలా చూసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆ అధికారి చెప్పారు.
ఇదిలా ఉండగా, ఐసిసి మెడలువంచే ప్రయత్నంలో భాగంగా బిసిసిఐ త్వరలో లండన్‌లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. ఈ జట్టును ప్రకటించడానికి ఐసిసి విధించిన తుది గడువు మంగళవారం కాగా, బిసిసిఐ మాత్రం ఇంకా జట్టును ప్రకటించలేదు. అయితే ఐసిసి నిబంధనల ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో గడువు ముగిసిన తర్వాత కూడా సభ్య దేశాలు తమ జట్లను ప్రకటించవచ్చు. 15 మంది సభ్యులుండే భారత జట్టులో 14 మంది పేర్లు దాదాపుగా ఇప్పటికే ఖరారయిన నేపథ్యంలో జట్టును ప్రకటించడం అనేది కేవలం లాంఛనప్రాయమే. అందువల్లనే బిసిసిఐ జట్టును ప్రకటించడానికి ఎలాంటి తొందరా చూపించడం లేదు. ‘ఒక వేళ మేము మే 5న జట్టును ప్రకటిస్తే ఐసిసి మమ్మల్ని టోర్నమెంట్‌లో పాల్గొనకుండా నిషేధిస్తుందా? చూద్దాం’ అని కూడా బిసిసిఐ అధికారి అన్నారు.