క్రీడాభూమి

రోహిత్ శర్మకు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 25: ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మకు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. సోమవారం ఇక్కడ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అంపైర్ నిర్ణయం పట్ల అసమ్మతిని వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. వాంఖడే స్టేడియంలో సోమవారం రాత్రి రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ వేసిన చివరి ఓవర్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు విజయం కోసం 17 పరుగులు సాధించాల్సి ఉన్న తరుణంలో నాలుగో బంతికి రోహిత్ శర్మ క్లీన్‌బౌల్డ్ కావడానికి ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్‌లో మొదటి బంతిని ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా డీప్ వికెట్‌లో బెన్ స్టోక్స్ చేతికి చిక్కగా, రెండో బంతిని రోహిత్ శర్మ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత ఉనద్కత్ వేసిన మూడో బంతి గైడ్‌లైన్‌కు దూరంగా పడటంతో రోహిత్ శర్మ దానిని వైడ్‌బాల్‌గా భావించి వదిలేశాడు. అయితే అంపైర్ ఎస్.రవి దానిని వైడ్ బాల్‌గా ప్రకటించలేదు. దీంతో అంపైర్ నిర్ణయం పట్ల రోహిత్ శర్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో స్క్వేర్ లెగ్ అంపైర్ ఎ.నంద కిశోర్ జోక్యం చేసుకున్నప్పటికీ రోహిత్ శర్మ వెనక్కి తక్కకుండా రవి వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ముంబయి ఇండియన్స్ జట్టు విజయం కోసం చివరి మూడు బంతుల్లో 11 పరుగులు సాధించాల్సి ఉన్న తరుణంలో రోహిత్ శర్మ నాలుగో బంతిని గాలిలోకి లేపి ఉనద్కత్‌కే రిటర్న్ క్యాచ్ ఇవ్వగా, ఐదో బంతికి మెక్‌క్లెనగన్ 1 పరుగు, చివరి బంతికి హర్భజన్ సింగ్ 6 పరుగులు సాధించి అజేయంగా నిలవడంతో ముంబయి ఇండియన్స్ జట్టు 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం తప్పేనని రోహిత్ శర్మ మ్యాచ్ ముగిసిన అనంతరం ఒప్పుకోవడంతో నిబంధనావళి ప్రకారం అతనికి మ్యాచ్ ఫీజులో 50 మొత్తాన్ని జరిమానా విధించినట్లు ఐపిఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ మ్యాచ్‌లో తమ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అంపైర్ పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని, మ్యాచ్ నియమ, నిబంధనలను వివరించేందుకు మాత్రమే ప్రయత్నించాడని ముంబయి ఇండియన్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.