క్రీడాభూమి

వచ్చే ఏడాది కెరీర్ కొనసాగిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకోవర్, ఏప్రిల్ 26: ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి కెరీర్‌ను కొనసాగిస్తానని ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ స్పష్టం చేసింది. ప్రముఖ జరలిస్టు గేల్ కింగ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందే తనకు గర్భవతినన్న విషయం తెలిసిందని చెప్పింది. ఆ టోర్నీలో సక్రమంగా ఆడగలనా? లేదా? అనే అనుమానం తలెత్తిందని, కానీ, జాగ్రత్తగా ఆడానని కెరీర్‌లో ఆస్ట్రేలియా ఓపెన్‌ను కైవసం చేసుకోవడం ద్వారా కెరీర్‌లో 23వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించిన సెరెనా తెలిపింది. ఆతర్వాత ప్రతివారి సెల్ఫీ తీసుకొని, బిడ్డ పెరుగుదలను చూసుకోవడం అలవాటుగా మారిందని చెప్పింది. అయితే, అన్ని ఫొటోలు కేవలం తనకు మాత్రమే పరిమితమని, కానీ, ఇటీవలే పొరపాటున షేర్ చేయడంతో అది సోషల్ మీడియాలో ప్రచారమైందని అన్నది. ఒక్క చిన్న పొరపాటే ప్రస్తుత చర్చకు కారణమని వ్యాఖ్యానించింది. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో తన సోదరి వీనస్ విలియమ్స్‌తో ఓడించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పింది. ఒక రకంగా తనతో తాను తలపడినట్టుగా అనిపించిందని అన్నది. మొదటి నుంచి తనను భయపెడుతున్న ఏకైక ప్రత్యర్థిగా వీనస్‌ను అభివర్ణించింది. అయితే, మైదానంలో మాత్రమే తాము బద్ధ శత్రువులమని, ఆతర్వాత మంచి స్నేహితులమని పేర్కొంది. తన బిడ్డ రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని 35 ఏళ్ల సెరెనా తెలిపింది. అనంతరం, 2018లో కెరీర్‌ను కొనసాగిస్తానని, రిటైర్మెంట్ ఆలోచన తనకు లేదని తేల్చిచెప్పింది.