క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో జూనియర్స్‌తో ఆడతా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టట్‌గార్ట్, ఏప్రిల్ 27: ఫ్రెంచ్ ఓపెన్ లేదా వింబుల్డన్ టోర్నీల్లో పాల్గొనేందుకు అవసరమైతే జూనియర్స్‌తోనైనా ఆడతానని రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా వ్యాఖ్యానించింది. నిషిద్ధ మాదక ద్రవ్యం మెల్డోనియంను ఉపయోగించినందుకు 15 నెలల నిషేధాన్ని ఎదుర్కొన్న ఆమె శిక్షా కాలాన్ని పూర్తిచేసి, ఇక్కడ ప్రారంభమైన స్టట్‌గార్ట్ డబ్ల్యుటిఎ టోర్నమెంట్‌తో మళ్లీ కెరీర్‌ను మొదలుపెట్టింది. మొదటి రౌండ్‌లో రాబర్టా విన్సీని 7-5, 6-3 తేడాతో ఓడించి, తాను ఫామ్‌లోనే ఉన్నానని నిరూపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఈ విజయం తనకు అంతులేని ఆనందాన్ని ఇచ్చిందని తెలిపింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొనే అర్హతపై టోర్నమెంట్ నిర్వాహకులు మే 15న నిర్ణయం తీసుకోనున్నారు. ఆతర్వాత ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నమెంట్ జూలై మాసంలో జరుగుతుంది. ఈ రెండు టోర్నీల్లో పాల్గొనే అవకాశాలపై విలేఖరులు అడిగిన ప్రశ్నపై ఆమె స్పందిస్తూ, ఆ రెండు టోర్నీల్లో ఆడాలనుకుంటే, జూనియర్స్ విభాగంలోనైనా ఆడతానని వ్యాఖ్యానించింది. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ స్టట్‌గార్డ్‌తోపాటు మాడ్రిడ్, రోమ్ డబ్ల్యుటిఎ టోర్నీల్లో పాల్గొనేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించడంపై సంతోషం వ్యక్తం చేసింది. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో ఆడే అవకాశం వస్తే ఆనందిస్తానని చెప్పింది. ఆ రెంటిలోనూ టైటిళ్లను సాధిస్తాననిగానీ, అద్భుతాలను సృష్టిస్తాననిగానీ చెప్పలేనని, అయితే, తన ఉనికిని చాటుకుంటానని షరపోవా స్పష్టం చేసింది. తన పునరాగమనంపై కొంత మంది క్రీడాకారిణులు చేస్తున్న విమర్శలను ప్రస్తావించగా, వాటిని తాను పట్టించుకోనని అన్నది. తన దృష్టి రాబోయే టోర్నీలపై ఉందని తెలిపింది.

చిత్రం..మరియా షరపోవా