క్రీడాభూమి

యుఎస్ క్రికెట్ సంఘంపై ఐసిసి వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 1: అమెరికా క్రికెట్ సంఘం (యుఎస్‌ఎసిఎ)పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిషేధం వేటు వేయడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే యుఎస్‌ఎసిఎ నిషేధంపై నిర్ణయం తీసుకున్న ఐసిసి పాలకమండలి ఈఏడాది జూన్‌లో జరగబోయే సమావేశంలో దానికి అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదిస్తుందని సమాచారం. అమెరికాలో క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉందని ఐసిసి అభిప్రాయం. సుమారు ఒకటిన్నర దశాబ్దాలుగా యుఎస్‌ఎసిఎకు అండదండలు అందిస్తూ, అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. అయితే, అమెరికా క్రికెట్ అధికారులు ఈ ప్రయత్నాలకు సరైన రీతిలో స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. గతంలోనూ ఇలాంటి ఆరోపణలే వెల్లువెత్తడంతో రెండు పార్యయాలు యుఎస్‌ఎసిఎపై ఐసిసి నిషేధం విధించింది. తాజాగా మరోసారి నిషేధానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటి వరకూ నిబంధానావళిని కూడా ఐసిసికి యుఎస్‌ఎసిఎ పంపలేదని అంటున్నారు. పదేపదే ఆదేశాలు జారీ చేసిన తర్వాత, ఇటీవల నిర్వహించిన ఒక సమావేశంలో ఆమోదించిన తీర్మానాల ప్రతిని పంపారని చెప్తున్నారు. ఈ నిర్లక్ష్య వైఖరిని ఐసిసి తీవ్రంగా పరిగణిస్తున్నది. అంతేగాక, అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి గొప్ప అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోడం లేదని ఐసిసి మండిపడుతున్నది. యుఎస్‌ఎసిఎను రద్దు చేసి, ఆ స్థానంలో మరో కొత్త సంఘాన్ని నియమించాలన్న ఆలోచనలో ఉందని సమాచారం.