క్రీడాభూమి

షహర్యార్ రాజీనామా తిరస్కృతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మే 1: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్‌గా షహర్యార్ ఖాన్ కొనసాగనున్నాడు. అనారోగ్య కారణాలతో పదవిలో తాను కొనసాగలేనని పేర్కొంటూ ఇటీవలే షహర్యార్ రాజీనామా పత్రాన్ని పిసిబికి చీఫ్ ప్యాట్రన్‌గా వ్యవహరిస్తున్న ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సమర్పించాడు. అయితే, అతని రాజీనామాను తిరస్కరించిన షరీఫ్, మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యే వరకూ కొనసాగాల్సిందిగా సూచించాడు. ఈనెల 30వ తేదీ తర్వాత తాను పిసిబి చైర్మన్‌గా కొనసాగబోనని, వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని షహర్యార్ ఇది వరకే ప్రధానికి రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. తనను బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా కోరాడు. కానీ, పాక్ ప్రధాని అతని సేవలు పాక్ క్రికెట్‌కు అవసరమని భావించినట్టు సమాచారం. అందుకే, అతనిని కొనసాగాల్సిందిగా కోరాడని స్థానిక మీడియా కథనం.

చిత్రం.. షహర్యార్ ఖాన్