క్రీడాభూమి

అర్జున అవార్డు రేసులో బెంబెం, జెజె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) ఈ ఏడాది లెజెండరీ క్రీడాకారిణి బెంబెం దేవితో పాటు జెజె లాల్‌పెకులా, గుర్‌ప్రీత్ సంధులను అర్జున అవార్డులకు నామినేట్ చేసింది. 36 ఏళ్ల బెంబెం దేవి గత ఏడాది షిల్లాంగ్‌లో సౌత్ ఏషియన్ గేమ్స్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన విషయం విదితమే. మహిళల ఫుట్‌బాల్‌లో సత్తా చాటుకుని అత్యంత ప్రతిభావంతురాలైన క్రీడాకారిణిగా పేరు పొందిన బెంబెం దేవి అర్జున అవార్డు పొందేందుకు అన్నివిధాలా అర్హురాలని, ఫుట్‌బాల్‌కు ఎనలేని సేవలను అందించిన ఆమెను ఈ పురస్కారంతో సత్కరించడం సముచితంగా ఉంటుందని ఎఐఎఫ్‌ఎఫ్ అభిప్రాయపడింది. ఇదిలావుంటే, యూరప్ ఫుట్‌బాల్ టోర్నీల్లో ఆడిన ఏకైక భారతీయుడిగా గుర్తింపు పొందిన 26 ఏళ్ల గోల్‌కీపర్ గుర్‌ప్రీత్‌కు కూడా అర్జున అవార్డు లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అతను గత ఏడాది నార్వేలో టాప్ డివిజన్ క్లబ్‌గా కొనసాగుతున్న స్టాబెక్ తరఫున ఆడి చక్కటి ప్రదర్శనతో సత్తా చాటుకున్నాడు. కాగా, కొంత కాలం నుంచి జాతీయ ఫుట్‌బాల్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతూ ఈ ఏడాది ఉత్తమ ఆటగాడిగా ప్రశంసలు పొందిన జెజె లాల్‌పెకులా ఇండియన్ లీగ్ (ఐ-లీగ్)లో మోహన్ బగాన్ జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.