క్రీడాభూమి

క్విటోవా ప్రాక్టీస్ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోనాకో, మే 3: రెండు పర్యాయాలు వింబఉల్డన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న పెట్రా క్విటోవా సుమారు నాలుగు నెలల తర్వాత మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. గుర్తుతెలియని వ్యక్తి దాడిలో గాయపడిన తర్వాత ఆమె ప్రాక్టీస్ కోసం కోర్టులోకి దిగడం ఇదే మొదటిసారి. నిరుడు డిసెంబర్‌లో ఒక ఆగంతకుడు క్విటోవా ఇంట్లోకి చొరబడ్డాడు. తనను నిరోధించడానికి ప్రయత్నించిన క్విటోవాపై అతను కత్తితో దాడి చేశాడు. ఎడమచేతి వాటం క్రీడాకారిణి ఎడమచేతికే గాయం కావడంతో ఆమె కెరీర్ ప్రమాదంలో పడిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, కొంతకాలం విశ్రాంతి తీసుకున్న ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకొని తిరిగి ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైంది. త్వరలోనే అంతర్జాతీయ టోర్నీల్లో ఆడే అవకాశం ఉంది.

శ్రీజేష్ అవుట్
ఇపో: భారత కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేష్ గాయం కారణంగా అజ్లాన్ షా టోర్నీలో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు అతని మోకాలికి గాయమైంది. వైద్య పరీక్షల తర్వాత, అతనికి విశ్రాంతి అవసరమని నిపుణులు ప్రకటించారు. కుడి మోకాలి వద్ద ఎముకలకు బలమైన గాయాలు తగిలాయని, కండరాలు చిట్లాయని భారత జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అజ్లాన్ షా టోర్నీకి ఇక అతను అందుబాటులో ఉండడని పేర్కొంది. ఇలావుంటే, వచ్చేనెల లండన్‌లో జరిగే వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్‌లోనూ శ్రీజేష్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.